అఖిల భారత రైతు కూలి సంఘం(Aikms ) రెండు సంస్థల విలీనం సందర్భంగా ప్రెస్ మీట్
జై భీమ్ న్యూస్ టుడే: (TG స్టేట్ ): అఖిల భారత రైతుకుల సంఘం(Aikms ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్న వి కోటేశ్వరరావు మండల ఎంకన్న, మరో Aikms అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్న మామిడాల బిక్షపతి, గౌని ఐలయ్యల* రెండు సంస్థలు ఈనెల 19న మహబూబా జిల్లా కేంద్రంలో విలీనం కానున్నాయి. ఈ సందర్భంగా స్థానిక బట్టు అంజయ్య భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా* *రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు, మామిడాల బిక్షపతి ప్రధాన కార్యదర్శులు మండల వెంకన్న, గౌని ఐలయ్యలు* మాట్లాడుతూ నేడు వ్యవసాయ రంగం కుదేలవుతున్నదని రోజు రోజుకు సంక్షోభంలోనికి వెళుతున్నదని దీనికి ప్రధాన కారణం మన పాలకులే అన్నారు. నేడు నూతన మార్కెట్ వ్యవసాయ విధానాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుందన్నారు వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు వారి చేతిలో పెట్టడానికి మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని దీనికి వ్యతిరేకంగా రైతాంగం ప్రజలు ఉద్యమించాలన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రభుత్వాలు రైతులు అప్పుల పాలవుతుంటే, ఆత్మహత్యలు జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారన్నారు. పచ్చటి పంట పొలాల మధ్యన ఈథనల్ కంపెనీల వలన వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి తీసుకుపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ కంపెనీల వలన గాలి నీరు కలుషిత మవడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఆహార సంక్షోభం ఏర్పడుతుందన్నారు. ప్రజా పోరాటాల మూలంగా నిర్మల్ జిల్లాలో దిలావత్ పూర్ లో నిర్మించే కంపెనీ ప్రభుత్వం రద్దు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా 30 కంపెనీలకు పర్మిషన్ ఇచ్చింది అన్నారు. వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం అఖిల భారత రైతుకుల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు రద్దు అయ్యేంతవరకు జరిగిన పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించింది అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన నల్ల చట్టాలు తీవ్ర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అన్నారు దీన్ని వ్యతిరేకించాలన్నారు. మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని అనేక సంవత్సరాలుగా రైతాంగం కోరుతున్న కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదన్నారు. అమలు అయ్యేంతవరకు రైతాంగ ఉద్యమాలను తీవ్రం చేయాలని రైతు వ్యతిరేక విధానాలకు ప్రతిఘటించాలని అడవి హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని వ్యతిరేకించాలన్నారు. ఈ వీడియో గల సమావేశంలో Aikms రాష్ట్ర సహాయ కార్యదర్శి మoడారి డేవిడ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడుజడ సత్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి లాల్ కుమార్, రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గూగులోటు సక్రు గుజ్జు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు
More Stories
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
డెడ్ లైన్ ప్రకటించి మనసులను చంపడం ఏమిటి ?
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి