తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేలా ప్రభుత్వంతో చర్చలు జరపండి

Spread the love

తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేలా ప్రభుత్వంతో చర్చలు జరపండి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు ఈడిగీ సంజయ్ గౌడ్ MLA కూనంనేని సాంబశివరావు గారికి వినతి పత్రం అందజేత

——————————————————————–

జై భీమ్ న్యూస్ టుడే, తాండూర్   : కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని తాండూరు పర్యటనలో భాగంగా వారిని కలిసి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు ఈడిగీ సంజయ్ గౌడ్ MLA కూనంనేని సాంబశివరావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలియజేయడం జరిగింది. దానితోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా 250 చదరపు గజాల ఇంటి స్థలం , నెలకు 25 వేల పెన్షన్ మరియు వారికి హెల్త్ కార్డు దానితోపాటు బస్ పాస్ , ఇతర ప్రభుత్వ పథకాలు వర్తించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం తమ వంతు కృషి చేయాలని తెలియజేయడం జరిగింది.