పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ లపై ప్రభుత్వంతో చర్చలు జరపండి.
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో MLA కూనంనేని సాంబశివరావు గారికి వినతి పత్రం అందచేత
——————————————————————
జై భీమ్ న్యూస్ టుడే : ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కారమయ్యే విధంగా చూడవలసిందిగా కోరుతూ PDSU (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్ మరియు AISF జిల్లా నాయకులు సుదర్శన్ లు కలిసి MLA కూనంనేని సాంబశివరావు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేటు జూనియర్ కళాశాలలు మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాకపోవడంతో విద్యార్థిని విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అని ఇప్పటికే పై చదువుల కోసం రకరకాల ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు సర్టిఫికెట్స్ అట్టి కళాశాలలోనే ఉండడంతో పేద ,మధ్యతరగతి, బడుగు ,బలహీనవర్గాల విద్యార్థులు సర్టిఫికెట్స్ లేక పై చదువులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 800 కోట్ల రూపాయల ఫీజు నెంబర్స్మెంటు స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. కేవలం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీదనే ఆధారపడి పనిచేస్తున్న డిగ్రీ కళాశాలలు జిల్లాలో ఇప్పటికే మూత వేసిన పరిస్థితి కనబడుతుంది. మరికొన్ని కళాశాలలో మూతపడే అవకాశం ఉంది. కావున దయచేసి తమరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ల పైన చర్చించి, సమస్యను పరిష్కారం చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది.
More Stories
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
పెంచిన విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి
బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు అప్పచెప్పకపోవడం మానవ హక్కుల ఉల్లంఘ