పెంచిన విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి

Spread the love

పెంచిన విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి

విద్యార్థి సంఘాలు ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూపర్డెంట్ గారికి వినతిపత్రం అందజేత

——————————————————————–

జై భీమ్ న్యూస్ టుడే : తెలంగాణలో రాష్ట్రంలో పెంచిన విద్యార్థుల యొక్క బస్సు పాసుల చార్జీలు తగ్గించాలని స్థానిక తాండూర్ డిపో సూపర్డెంట్ గారికి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు కలిసి వినతి పత్రం అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా KNPS రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ చంద్రప్ప, PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, AISF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు N. సుదర్శన్, తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు E. సంజయ్ గౌడు లు మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల బస్సు పాసు యొక్క చార్జీలు పెంచడం వల్ల పేద, బడుగు బలహీన ,వర్గాల విద్యార్థుల పైన భారం పడుతుందని వీటిని తగ్గించాలని తెలియజేయడం జరిగింది. దానితోపాటు ప్రస్తుతం 1150 ఉన్న స్టూడెంట్స్ పాస్ ఆర్డినరీ బస్సు రేట్లు 1400కు పెంచడం మరియు 1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాసులను 1600లకు పెంచడం దానితోపాటు

1450 ఉన్న మెట్రో డీలక్స్ పాసు 1800 పెంచడం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు బస్సు పాసు చార్జీలు పెంచడం పేద, బడుగు, బలహీన విద్యార్థుల పైన భారం పడుతుందని పేర్కొనడం జరిగింది.

విద్యా భరోసా కార్డు ,ఐదు లక్షలు ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం , ప్రతి మండలానికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పాఠశాల ఏర్పాటు చేయాలని పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు అశోక్ పాల్గొనడం జరిగింది.