బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి
మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు అప్పచెప్పకపోవడం మానవ హక్కుల ఉల్లంఘ
ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలి
ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి
తాండూర్ పట్టణంలో ప్రజాసంఘాల , విద్యార్థి సంఘాల డిమాండ్
——————————————————————–
తాండూరు పట్టణం, (జై భీమ్ న్యూస్ టుడే): ప్రజా సంఘా లు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మరియు మావోయిస్టుల ఎన్కౌంటర్ లను నిరసిస్తూ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా KNPS రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ.చంద్రప్ప, PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, CPM జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప లు మాట్లాడుతూ బుటకపు హత్యలు చేసి ఆదివాసి అమాయక ప్రజలను మరియు మావోయిస్టు నాయకులను ఆపరేషన్ కగారు పేరుతో దాదాపు 500 మంది పైగా ఎన్కౌంటర్ల పేర్లతో మారణ కాండం సృష్టిస్తూ దేశంలో రాజ్యాంగపు హక్కులను కాల రాస్తున్న బిజెపి ప్రభుత్వం తమ యొక్క చర్యలను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చంపిన 28 మందిలో చతిస్గడ్ రాష్ట్రం అబూజ్ మడ్ అడవుల్లో ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీలను, మావోయిస్టు సానుభూతిపరులను అత్యంత క్రూరంగా హత్య చేశారని తెలిపారు. మావోయిస్టు జాతీయ కార్యదర్శి కేశవరావును నిరాయుదుడిగా పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ కథలల్లుతున్నారని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అడవి సంపదను ఇతర దేశాలకు తరలించడంలో భాగంగా నే ఆపరేషన్ కలర్ చేపట్టారని మరియు ఆదాని, అంబానీలకు మూకుమ్మడిగా అడవిని, అడవిలో ఉన్న సంపదలను కట్టబెడుతున్నారని, అందులో భాగంగానే ఈ నరమేధం జరుగుతుందని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొండగావ్, జిల్లాలతో పాటు తెలంగాణలో కర్రిగుట్ట తదితర అడవులను జల్లెడ పట్టి ఆదివాసీలను హహనం చేయడం అత్యంత దుర్మార్గ చర్య అని అన్నారు. వెంటనే ఆపరేషన్ కగారును విరమించుకోవాలని, ఇప్పటికే మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ శాంతి చర్చలు జరుపకుండా కేంద్ర బలగాలతో ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్య చేయడం సరైనది కాదని అన్నారు. దేశంలో బిజెపి మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ టెర్రరిస్టులతో చర్చలు జరిపి యుద్ధాన్ని విరమించింది కానీ, స్వదేశంలో పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలకు మాత్రం సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. తక్షణమే వారితో శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీల హననాన్ని ఆపాలని, ఇప్పటివరకు జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప,KNPS కొడంగల్ మండల్ అధ్యక్షుడు అంజి, KNPS కార్యదర్శి మహేష్, సభ్యులు ఆనందు, పకీరప్ప, వెంకట్ , తదితరులు పాల్గొన్నారు.
More Stories
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేలా ప్రభుత్వంతో చర్చలు జరపండి