డెడ్ లైన్ ప్రకటించి మనసులను చంపడం ఏమిటి ?
ముస్లిం, హిందువుల మధ్య విద్వేషాలను రెచ్చగోడుతున్నారు
జై భీమ్ న్యూస్ టుడే: (హైదరాబాద్)
దేశంలో మోడీ ,అమిత్ షా ల ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదను కార్పొరేట్లకు దోచి పెట్టుటకు అటవీ సంపదకు రక్షణగా ఉన్నటువంటి ఆదివాసీలను, మావోయిస్టులను అత్యంత క్రూరంగా హత్యాకాండను సృష్టిస్తున్నారని, దేశానికి సరిహద్దున ఉండి , భద్రత కల్పించాల్సిన భద్రత దళాలు స్వంత దేశంలోని దేశ ప్రజలపై యుద్ధం చేయడం తీవ్రంగా వ్యతిరేకించాలని, పహల్గామ్ లో సైనిక వేషధారణలో వచ్చి పర్యాటకులను 22 నిమిషాలలో అత్యంత క్రూరంగా 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని దీనిని ఖండిస్తున్నామని సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కే. గోవర్ధన్ అన్నారు.
నక్సల్ బరి 58వ పోరాట దినోత్సవం సందర్భంగా సిపిఐ (ఎమ్ .ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జలగం జనార్దన్ (జెన్ను సార్) నాలుగో వర్ధంతి స్మారక ఉపన్యాసం ను ” జమ్ము కాశ్మీర్ సమస్య, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు, ఆదివాసీలపై చేస్తున్న కేంద్ర ప్రభుత్వ యుద్ధాన్ని” వ్యతిరేకిస్తూ స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలో చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రం నందు జిల్లా స్థాయి సభ ను పార్టీ జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఆఫీస్ ముందు జెన్ను సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. గోవర్ధన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ* కాశ్మీర్ సమస్య పరిష్కారం కానంత కాలం పాకిస్తాన్ ,భారతదేశాల మధ్యన సంఘర్షణ యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. సామ్రాజ్యవాద దేశాలు తమ ఆయుధ వ్యాపారం కోసం యుద్ధాలను ప్రోత్సహిస్తూ రెండు దేశాల ప్రజలను మానవ హననం చేస్తారు. పర్యాటక కేంద్రమైన కాశ్మీర్ కు కుంకుమ పువ్వు, యాపిల్స్ దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా డిమాండ్ ఉన్నది. కోట్లాది రూపాయల వ్యాపారం కొనసాగుతున్నది. వీటిపై కన్నేసిన సామ్రాజ్యవాదులు, కార్పోరేట్ లు స్వాధీనం చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం పై ఒత్తిడి చేసి 370,35 A ఆర్టికల్ రద్దు చేయించి, దానిని కబ్జా చేస్తున్నారు. గత ఒప్పందాల ప్రకారం కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. నక్సలిజాన్ని నిర్మూలించుటకు గత ప్రభుత్వాల నుండి నేటి మోడీ వరకు సల్వాజుడం,,గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్ ల పేర్లతో ఆదివాసీలను మావోయిస్టులను హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి నుండి నేటి వరకు 550 పైగా హత్యలు చేశారని దుయ్యబట్టారు. అటవీ సంపద పై ఆదివాసులకు హక్కు లేకుండా కార్పొరేట్లకు అప్పగించడానికి యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ బద్దంగా కాకుండా మోడీ ప్రభుత్వం నేరపూరిత పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. దీనిపై ప్రజలు, ప్రజాస్వామీక వాదులు,విద్యావంతుల, మేధావులు ఐక్యంగా వ్యతిరేకించాలని కోరారు. ఏపూరి గ్రామంలో జన్మించిన జలగం జనార్ధన్( జన్ను) ఉన్న ఊరును, కన్నవారిని వదిలిపెట్టి 14 సంవత్సరాలు అజ్ఞాత జీవితాన్ని గడిపి, పేద ప్రజల విముక్తి కోసం పోరాడిన త్యాగదనుడని ఆయన అడుగుజాడల్లో పయనించాలని , అసమానతలు లేని సమాజం ఏర్పడేదాకా పోరాడడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి. కోటేశ్వరరావు, ప్రముఖ అడ్వకేట్ కే. ధర్మార్జున్, ఎల్. భద్రయ్య, పేద ప్రజల డాక్టర్ రంగారెడ్డి, జన్ను జీవిత సహచరిని కలక్కా, ఐఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, ఐఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు , ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. లక్ష్మయ్య, బొడ్డు శంకర్, పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్, ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి అలుగుబెల్లి వెంకటరెడ్డి, ఐఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేషోజు మధు, అరుణోదయ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉదయగిరి ,కంచనపల్లి సైదులు, పి వై ఎల్ జిల్లా కోశాధికారి బండి రవి, ఐఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి వి. నరసింహారావు, దాసరి శ్రీనివాస్, పి డి ఎస్ యు, పి వై ఎల్, బి ఓ డబ్ల్యు నాయకులు పుల్లూరి సింహాద్రి, ధారావత రవి నల్గొండ నాగయ్య ,కంచెర్ల నరసమ్మ,వీరబోయిన రమేష్, ఎర్ర ఉమేష్, సామ నర్సిరెడ్డి, వెంకట యాదవ్, రామ లింగమ్మ తదితరులు పాల్గొన్నారు.
More Stories
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి
కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని వెంటనే ఆపాలి, ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేసి మావోయిస్టు పార్టీలతో శాంతి చర్చలు జరపాలి.. వామపక్ష పార్టీలు ,ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల డిమాండ్