తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
జై భీమ్ న్యూస్ టుడే (తాండూరు ): ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షులు ఈడిగి సంజయ్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ అన్న గారిని హైదరాబాదులో వారి ఆఫీసులో కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది . తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమకాలకు నెలవారి పెన్షన్ 25000 ఇవ్వాలని , ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఉద్యమకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని వివిధ సమస్యలను గురించి అన్న గారితో చర్చించడం జరిగిందని పత్రికా ప్రకటనలో సంజయ్ గౌడ్ చెప్పడం జరిగింది తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న అక్రమ కేసులు కూడా వెంటనే బేసిక్ గా ఎత్తివేయాలని చెప్పడం జరిగింది.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేలా ప్రభుత్వంతో చర్చలు జరపండి