తాండూరు ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిరసన ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్….CITU 

Spread the love

ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 వేలు ఇవ్వాలని సిఐటియు ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాండూరు ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిరసన ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్….CITU 

 జై భీమ్ న్యూస్ టుడే: (తాండూర్):                           సిఐటియు తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు తాండూరు ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఆశ వర్కర్స్ సిఐటియు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆశా వర్కర్స్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. దానితోపాటు ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని ,ఉద్యోగ భద్రత కల్పించాలని మరియు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని పేర్కొనడం జరిగింది.  రాష్ట్ర వ్యాప్తంగా ఆశ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారమూలోనికి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న ఆశ వర్కర్స్ కు కనీస వేతనం అమలు చేయకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది తెలియజేేయడం జరిగిందిి. అదేవిధంగా ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలలో తాండూర్ నియోజకవర్గం నుండి గెలుపొందిన ఎమ్మెల్యే శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు ఆశ వర్కర్స్ సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడాలని తెలియజేయడం జరిగింది. ఆశ వర్కర్స్ కు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం 50 లక్షలు చేయాలని మరియు ఏఎన్ఎం పోస్టులలో ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మంగమ్మ తాండూర్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల ఆశ వర్కర్స్ రేణుక అనంత భాగ్యలక్ష్మి శ్రీదేవి అంజమ్మ సులోచన జగదేవి మున్ని కాంచన రాధమ్మ అరుణ యాదమ్మ ఆశ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.