ఆలేరు రైల్వే గేట్ లో  మోడీ ప్రభుత్వం యొక్క నేషనల్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్” కాపీలను దగ్ధం చేసిన AIKMS

Spread the love

 

ఆలేరు రైల్వే గేట్ లో  మోడీ ప్రభుత్వం యొక్క నేషనల్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్” కాపీలను దగ్ధం చేసిన AIKMS

 జై భీమ్ న్యూస్ టుడే: (ఆలేరు,TG):   ఈ సందర్భంగా ఏ ఐ కే ఎం ఎస్ తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు మామిడాల బిక్ష పతి,రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి రాజయ్య,రైతు సంఘం రాష్ట్ర నాయకులు మంగ నరసింహులు,తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేమిడి ఉప్పలయ్య లు మాట్లాడుతూ,మోడీ ప్రభుత్వ ప్రతిపాదన మొత్తం కార్పోరేట్ అనుకూల మరియు రైతు వ్యతిరేక దుష్ట డిజైన్ అని స్పష్టం చేశారు.

 

 

సోమవారం నాడు ఆలేరు రైల్వే గేట్ వద్ద మోడీ కార్పోరేట్ నేషనల్ పాలసీ ప్రేమ్ వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కాపీలను సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్ కే ఎం)జాతీయ కమిటీ పిలుపు మేరకు దగ్ధం చేయడం జరిగింది.

 

 

అనంతరం బిక్ష పతి,రాజయ్య, నర్సింహులు, ఉప్పలయ్య లు మాట్లాడుతూ,చారిత్రాత్మక రైతాంగ ఉద్యమాలచే తిరస్కరించబడిన మరియు మోడీ పాలనలో బలవంతంగా ఉపసంహరించబడిన మూడు పాత నల్ల వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావడం బ్యాక్ డోర్ వ్యూహం అని అన్నారు.

 

35 పేజీల నిడివి గల పత్రంలో,చట్టబద్ధమైన కనీస మద్దతు ధర గురించి ఒక్క ప్రస్తావన కూడా లేదని,ఇది రైతు వ్యతిరేక,కార్పోరేట్ అనుకూల ప్రభుత్వమని స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు.

13 జనవరి 2025 న ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ యొక్క ప్రతి యూనిట్ వీధిలో ఉంటుందని,మరియు స్వతంత్రంగా లేదా ఐక్యంగా “జాతీయ విధానం”అని పిలువబడే కాఫీలను దేశ వ్యాప్తంగా దగ్ధం చేయడం జరిగిందని చెప్పారు.

 

ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని,రైతులతో ప్రధాన మంత్రి చర్చించాలని, డిమాండ్ చేస్తూ 76 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ట్రాక్టర్,వాహన, మోటార్ సైకిల్ ప్రదర్శనలను జిల్లా కేంద్రంలో,డివిజన్ స్థాయిలో నిర్వహించాలని ఎస్ కే ఎం జాతీయ కమిటీ నిర్ణయం తీసుకుందని దీని విజయవంతం కోసం రైతు లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్,డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, పీ ఓ డబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సీత,ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, కె. అడవయ్య, చిర బోయిన రాజయ్య, బేజాడి కుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, పీ వై ఎల్ జిల్లా అద్యక్షులు సాదుల శ్రీకాంత్,ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా,డివిజన్ నాయకులు చిర బోయిన కొమురయ్య,మామిడాల బాల మల్లేష్, అంజి బాబు తదితరులు పాల్గొన్నారు.