ఈరోజు లగిచర్ల రైతు కుటుంబాల పరామర్శకు వెళ్లిన PDSU రాష్ట్ర బృందాన్ని అక్రమంగా అరెస్టు చేసి పరిగి PS లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
POW రాష్ట్ర కార్యదర్శి వై గీత
PDSU రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్ మరియు PDSU రాష్ట్ర నాయకులు శ్రీను, ఆసిఫ్, రహీం , రాజేశ్వర్, లోకేష్ ,అక్షిత్, శ్రీకాంత్ ,అశోక్, మస్తాన్లను లగచర్ల బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడదామని బయలుదేరి వస్తున్న పిడిఎస్యు రాష్ట్ర బృందాన్ని పరిగి లో అడ్డగించి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్ ను తాండూర్ లో ముందస్తు రెస్ట్ చేయడం జరిగింది. అరెస్టులు అన్నీ కూడా అప్రజా స్వామీకమైనవిగా POW రాష్ట్ర కార్యదర్శి వై గీత తీవ్రంగా ఖండిస్తు.
రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల దరిదాపుల్లోకి ఎవర్ని కూడా రానివ్వకుండా లగచర్ల భూ బాధితుల తోటి ఎవరిని కలిసి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం సరైంది కాదని ఫార్మా భూ బాధిత రైతులకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి.
పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలి. ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. డిమాండ్ చేస్తూ అరెస్టు అయినటువంటి PDSU నాయకులందరినీ వెంటనే విడుదల చేయాలి.
More Stories
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
డెడ్ లైన్ ప్రకటించి మనసులను చంపడం ఏమిటి ?
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి