లగచర్ల రైతులను పరామర్శిస్తామంటే అరెస్టులా?PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్

Spread the love

లగచర్ల రైతులను పరామర్శిస్తామంటే అరెస్టులా?

PDSU విద్యార్థి సంఘం నాయకుల ముందస్తు అరెస్టులు

తాండూర్: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా లగచర్ల రైతు కుటుంబాలకు పరామర్శించడానికి బయలుదేరితే తాండూర్ డివిజన్లోని PDSU విద్యార్థి సంఘం నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా *PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్* మాట్లాడుతూ రైతులను పరామర్శిస్తామంటే ఎందుకు ముందస్తు అరెస్టు చేస్తున్నారని? ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదని తెలియజేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న రైతులను పరామర్శించి వాస్తవాలను తెలుసుకోవడానికి బయలుదేరితే జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నియంత్ర చర్యలకు పాల్పడితే PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, లగచర్ల రైతు కుటుంబాలకు న్యాయం దక్కింతవరకు పోరాటమాపేది లేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో PDSU జిల్లా సభ్యులు ప్రకాష్, తాండూర్ డివిజన్ అధ్యక్షులు H. నవీన్ తదితరులు ఉన్నారు