అంబేద్కర్ విగ్రహం వద్ద 75 వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం
రాజ్యాంగ ప్రవేశికను చదివిన PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్
తాండూర్: స్థానిక తాండూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సంఘాలు మరియు యువకుల ఆధ్వర్యంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి రాజ్యాంగ ప్రవేశికను చదవడం జరిగింది. ఈ సందర్భంగా PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల తలరాతను మార్చిన విధాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో అవమానాలను ఎదుర్కొని రాజ్యాంగ రచించడం జరిగిందని తెలియజేయడం జరిగింది. దానితోపాటు ప్రస్తుతం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతున్నాయని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను కాల రాస్తుందని , రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొని వచ్చి దేశంలో ఉన్న రైతులందరికీ తీరని అన్యాయం చేస్తుందని, దేశంలో మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చూస్తుందని తెలియజేయడం జరిగింది. యువతీ యువకులు, మేధావులు, ఇప్పటికైనా మేల్కొనకపోతే పూర్వకాలము పరిస్థితిలే మల్లి దాపరిస్తాయని పేర్కొనడం జరిగింది. ప్రతి ఒక్కరు పైన భారత రాజ్యాంగంను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, దానితోపాటు ప్రతి పాఠశాలలో, కళాశాలలో భారత రాజ్యాంగ ప్రవేశికను తప్పనిసరిగా చదివించాలని డిమాండ్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగ విలువలను, హక్కులను బాధ్యతలను ప్రతి పౌరుడికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే దేశంలో ఎటు చూసినా దళితులం పైన దాడులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయని, ప్రశ్నించిన వారి పైన రకరకాల కేసులో పేరుతో వేధిస్తున్నారని, రైతుల పైన, కార్మికుల పైన, నిరుద్యోగుల అందరు కూడా తమ హక్కుల కోసం పోరాడుతూ ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నదని పేర్కొనడం జరిగింది. కావున భారత రాజ్యాంగ స్ఫూర్తితో యువత యువకులు అందరూ కూడా పోరాటలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివ, ప్రకాష్, వెంకట్, అశోక్, రమేష్, నవీన్, అనిల్, సంగమేశ్వర్, సుదర్శన్ , యువకులు తదితరులు పాల్గొన్నారు
More Stories
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
డెడ్ లైన్ ప్రకటించి మనసులను చంపడం ఏమిటి ?
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి