సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అజ్ఞాత దళ కమాండర్ కామ్రేడ్ పూణేం రమేషన్న ఆక్రమ అరెస్టును ఖండించండి. కామ్రేడ్ రమేష్ అన్నకు ఎలాంటి హని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పరచాలి
రమేష్ అరెస్టు ని ఖండించండి
CPI (M-L) న్యూడెమోక్రసీ ————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ పూనెం రమేష్ ను ఈరోజు సాయంత్రం ఇల్లందు మండలం ఎల్లాపురం గ్రామంలో పోలీసులు నిర్బంధించారు. ఇప్పటికీ రమేష్ ఆచూకీని పోలీసులు ప్రకటించడం లేదు. కుటుంబానికి కూడా సమాచారం ఇవ్వడం లేదు. చాలా ఆందోళనగా ఉంది. తనకి ప్రమాదాన్ని తలపెట్టేందుకు పోలీసులు పూనుకుంటారని అనుమానించాల్సి వస్తుంది. ఇలానే జరిగితే, ఇది వారు గౌరవిస్తున్నారని చెప్పుకుంటున్న రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.
పూనెం రమేష్ దశాబ్దాలుగా ఆదివాసి ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఉద్యమిస్తున్నాడు. వారి పోడు భూముల పట్టాల కొరకు పోరాడినాడు. ఆదివాసీలకు , పేద ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమాలను ప్రశ్నించాడు. ప్రజల కోసం అను నిత్యం పోరాడినాడు. రమేష్ ను మానసిక ఒత్తిడికి, శారీరక దాడికి గురిచేయరాదు. కేసులు ఉంటే కోర్టుకి తక్షణమే అప్పగించాలి. రమేష్ ని కోర్టు కు అప్పగించేవరకు నిరసన కార్యక్రమాలు చేయాలని ప్రజలను కోరుతున్నాం.
పి. సూర్యం
*CPI (M L) న్యూడెమోక్రసి*
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
28.11.2024
More Stories
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
డెడ్ లైన్ ప్రకటించి మనసులను చంపడం ఏమిటి ?
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి