లగచర్ల వెళ్తున్న మహిళ సంఘాల నాయకులను అరెస్టు చేయడం సరికాదు నిజనిర్ధారణను జరగనివ్వాలి. -ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU)- జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ 

Spread the love

 

 

లగచర్ల వెళ్తున్న మహిళ సంఘాల నాయకులను అరెస్టు చేయడం సరికాదు నిజనిర్ధారణను జరగనివ్వాలి -ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU)- జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ 

నిజనిర్ధారణకు లగచర్లకు వెళ్తున్న మహిళ, ట్రాన్స్ జెండర్ జేఏసీ నాయకులను వికారాబాద్ జిల్లా, బొమ్మరాసుపేట మండలం, సుంకిమెట్ల గ్రామం వద్ద అరెస్టు చేయడాన్ని PDSU తీవ్రంగా ఖండిస్తుంది.

అరెస్ట్ అయిన వారిలో POW జాతీయ నాయకులు ఝాన్సీ, సంధ్య, POW రాష్ట్ర అధ్యక్షులు జి.అనసూయ, ఉపాధ్యక్షులు Y.గీత, జేఏసీ నాయకులు సజయ, ప్రొఫెసర్ పద్మజాషా, సిఎంఎస్ జ్యోతి తదితరులు ఉన్నారు. అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఏడవ గ్యారెంటీగా అమలు చేస్తామని మాట తప్పినట్లు ఈ అరెస్టు రుజువు చేస్తుంది. నిజనిర్ధారణ జరగడం ద్వారా వచ్చే నష్టమేంటో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. అర్ధరాత్రి మా ఇంట్లోకి చొరబడి మమ్మల్ని కొట్టి మా వాళ్లను అరెస్టు చేశారని దుర్మార్గంగా వ్యవహరించారని పేద గిరిజన మహిళలు చెబుతున్న మాటలకు బలం చేకూర్చేలా పోలీసుల అరెస్టులు ఉన్నాయి. ఇప్పటికైనా ఫార్మా కంపెనీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అరెస్టు చేసి జైల్లలో నిర్బంధించిన లగచర్ల గిరిజన రైతులను, ఈరోజు అరెస్టు చేసిన మహిళ ట్రాన్స్ జెండర్ జేఏసీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) వికారాబాద్ జిల్లా కమిటీగా డిమాండ్ చేయడం జరిగింది.