జిల్లా లో ఈ నెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు
గురువారము సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జూమ్ మీటింగ్ ద్వార మాట్లాడుతూ గ్రూప్-3 పరీక్షలు జాగ్రతగా నిర్వహించాలని . చీఫ్ సుపరింటేన్దేంట్లు ప్రతి సెంటర్ ను విసిట్ చేసి పరీక్ష సెంటర్లో సి సి కెమెరాలు, పర్నిచర్, లైట్స్, టైయీలెట్స్, రన్నింగ్ వాటర్ ,విద్యుత్ అన్ని సదుపాయాలు చెక్ చేయాలనీ ఆదేశించారు. నవంబర్ 17న ఉదయం 10.00 గంటల నుండి మధ్యాన్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని, ఆ మరుసటి రోజైన 18వ తేదీన మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష ఉంటుందని వివరించారు. బయో మెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. ఉదయం పరీక్షకు సంబంధించి 9.30 గంటల వరకే పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, , మధ్యాహ్నం పరీక్షకు సంబంధించి 2.30 తరువాత ఎవరినీ లోనికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ కు తప్ప మరెవ్వరికి పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రం లోకి మొబైల్ ఫోన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, ఈ మేరకు ప్రతి కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిపించాలని సూచించారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి వాటికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రశ్న పత్రాలు, ఇతర పరీక్షా సామాగ్రిని పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ నుండి ఎగ్జామినేషన్ సెంటర్స్ కు తరలించాలన్నారు. పరీక్షా కేంద్రం లోనికి ఇతరులు ఎవరిని అనుమతించకూడదని, పరీక్షా సమయం ప్రారంభం నుండి ముగిసేంత వరకు పరీక్ష కేంద్రం నుండి అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లు కూడా బయటకు వెళ్లకూడదని. ఎలాంటి పొరపాట్లు, ఆరోపణలకు తావులేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. దివ్యంగులైన అభ్యర్థులు తమకు బదులుగా ఇతరులచే పరీక్ష రాసేందుకు అనుమతి కోరిన చోట, ఈసారి కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనను అనుసరిస్తూ స్క్రైబ్ లను పరీక్షకు 24 గంటల ముందు దివ్యంగులైన అభ్యర్థులతో పరిచయం చేయించాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, పరీక్ష పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసిఉంచేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
జూమ్ మీటింగ్ లో జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి,అడిషనల్ ఎస్ పి రవీందర్ రెడ్డి, అబ్జార్వర్లు , మున్సిపల్ కమిషనర్ జాకీర్ హుస్సేన్ , సుపరింతెన్దేంట్ నేహమత్ హాలి ,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……..జిల్లా పౌర సంబంధాల అధికారి వికారాబాద్ చే జారి చేయబడినది
More Stories
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
డెడ్ లైన్ ప్రకటించి మనసులను చంపడం ఏమిటి ?
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి