కామ్రేడ్ పైలా వాసుదేవరావు ఆశయ సాధనకై పోరాడాలి సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు

Spread the love

కామ్రేడ్ పైలా వాసుదేవరావు ఆశయ సాధనకై పోరాడాలి

సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు

జై భీమ్ న్యూస్ టుడే:(ఇల్లందు)

శ్రీకాకుళ సాయుధ రైతాంగా పోరాట యోధుడు,సీపీఐ (ఎమ్-ఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత అమరుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు జీవితం నేటి ఉద్యమకారులకు ఆదర్శ ప్రాయమని ఆయన ఆశయ సాధనకు పోరాడాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అవునూరి మధు పిలుపునిచ్చారు.పైలా వాసుదేవరావు 15వ వర్ధంతి సందర్బంగా ఈరోజు శుక్రవారం ఇల్లందు న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ శ్రీకాకుళ గిరిజన,రైతాంగ ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసిన త్యాగజీవి పైలా వాసుదేవరావు అని అన్నారు.విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలోకి తనతో పాటు భార్యా, పిల్లలను కూడా భాగస్వాములుగా చేశాడని కొనియాడారు. ఉద్యమ నిర్మాణంతో పాటు సిద్ధాంత రాజకీయాలను నిలబెట్టడంలో రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాటంలో ఆయన ముందు పీఠానా నిలబడ్డారని గుర్తు చేశారు.కార్మిక రంగంలో, రైతాంగంలో,దళిత, ఆదివాసీలలో సమరశీల ప్రతిఘటనా పోరాటాలను నిర్మించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళులని పేర్కొన్నారు. ముందుగా అమరుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు నాయకులు కొక్కు సారంగపాణి,కొండపల్లి శ్రీనివాస్,డి.మోహన్ రావు, మండల వెంకన్న,ఎన్నం నరసయ్య,మహేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.