ఈరోజు లెఫ్ట్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో “ఛలో సెక్రటేరియట్”పిలుపు లో భాగంగా తాండూర్ టౌన్ పోలీస్ లు PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ ను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.
PDSU విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్టు
HCU లోని 400 ఏకరాల భూమిని పరిరక్షించాలి
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
—PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్
—————————————————————–
తాండూర్: “HCU లోని 400 ఏకరాల భూమిని పరిరక్షించాలని”
“ఉస్మానియా యూనివర్సిటీ ఆప్రజాస్వామిక సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలి”
ఈరోజు లెఫ్ట్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో “ఛలో సెక్రటేరియట్”పిలుపు లో భాగంగా తాండూర్ టౌన్ పోలీస్ లు PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ ను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర ప్రభుత్వం PDSU , ప్రజా సంఘాల, లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకులను అప్రజ స్వామి కంగా ముందస్తు అరెస్టులు చేస్తూ, ప్రశ్నించే గొంతుకులను నొక్కి వేసే ప్రయత్నం చేస్తున్నాడని, తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలనను తలపిస్తుందని ఇది సరైన విధానం కాదని తెలియజేయడం జరిగింది.
HCU భూములను వేలంపాట వేయటాన్ని విరమించుకోవాలి.
వెంటనే ఆ భూములను హెచ్సీయూ యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకొచ్చిన సర్కులర్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
అక్రమంగా విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి అని
యూనివర్సిటీలో ప్రజాస్వామ్యత వాతావరణాన్ని నెలకొల్పటానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవాలి డిమాండ్ చేయడం జరిగింది.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి