హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU లో కొనసాగుతున్న ఆందోళనల పోరాటాలు నేటి విద్యార్థి సంఘాల చలో సెక్రటేరియట్, ఉమెన్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం వంటి కార్యక్రమాల రిత్యా ప్రజాసంఘాల నాయకుల వాయిస్ అణచివేయడం కోసం ముందస్తు అరెస్టులు
అర్ధరాత్రి HCU లోకి JCBలు – ప్రజాసంఘాల నాయకుల వద్దకు పోలీసులు
జై భీమ్ న్యూస్ టుడే, (వికారాబాద్ జిల్లా కేంద్రం):
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU లో కొనసాగుతున్న ఆందోళనల పోరాటాలు నేటి విద్యార్థి సంఘాల చలో సెక్రటేరియట్, ఉమెన్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం వంటి కార్యక్రమాల రిత్యా ప్రజాసంఘాల నాయకుల వాయిస్ అణచివేయడం కోసం ముందస్తు అరెస్టులు.
ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర కార్యదర్శి వై గీత, AIKMS జిల్లా అధ్యక్షులు వై మహేందర్ ను వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం 3:30 కి ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుండి అక్రమంగా విద్యార్థి, ప్రజా సంఘాల నాయకుల అరెస్టులు అప్రజాస్వామీకం రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చీకటి విధ్వంసాలే కొనసాగుతున్నాయి మొత్తం భూముల పైన పడటం అభివృద్ధి పేరుతో పేదల నుండి భూముల గుంజుకోవడం ప్రభుత్వ భూములు అమ్ముకోవడం వంటి చర్యలను తెలంగాణ పౌర సమాజం సహించలేక ప్రశ్నిస్తే నిర్బంధించడం ప్రశ్నించే గొంతులను, ప్రజా సంఘాలను వాణిచివేయడం సరైనది కాదు
రాష్ట్ర లో ప్రభుత్వాన్ని నడపడానికి ఆదాయం కావాలని అడ్డగోలుగా ప్రభుత్వ భూములు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం, గ్రామాలలో బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారిస్తూ ఆదాయాన్ని పెంచుకోవడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని నడపడానికి ఒక వైపు డబ్బులు లేవని చెప్తూనే మరోవైపు అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ రాష్ట్రంలో స్త్రీల యొక్క అందాల సుందరీకరణ పోటీలు ఏ ప్రయోజనాల కోసం పెడుతున్నారని విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేయడానికి నిధులు కేటాయించకుండా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల కనీస వేతనం కోసం మాట్లాడుతున్న పట్టించుకోకుండా, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండి జూనియర్, డిగ్రీ కాలేజీలో మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. విద్యారంగానికి నిధులు కేటాయించమని అడిగిన విద్యార్థుల మీద లాటి జులపిస్తూ ప్రజా పోరాటాలను ఉద్యమంల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల అణచివేస్తూ కాంక్షలు పెడుతూ విద్యార్థి, ప్రజా సంఘాల ఉద్యమాలను ఆపలేరు రేవంత్ సర్కార్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి యూనివర్సిటీ భూములను వేలం వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడాలి అడవులను జీవో వైవిధ్యాన్ని కాపాడాలి అటవీ విధ్వంసక చర్యలను మానుకోవాలి
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి