మహిళలకు 9 రూపాయలకే చీర ఇస్తామని మోసం చేసిన జేఎల్ఎం షాపింగ్ మాల్ పైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.
ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై గీత
జై భీమ్ న్యూస్ టుడే: (వికారాబాద్ జిల్లా):
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న ఆఫర్ ప్రకటించి మహిళలందరికీ 9 రూపాయలకే చీర ఇస్తామని విస్తృతంగా గ్రామాలలో ప్రచారం చేసి ప్రారంభోత్సవానికి పాల్గొనాలని మహిళలు అందరినీ ఆహ్వానించడం జరిగింది జేఎల్ఎం ఆహ్వానానికి స్పందించి వచ్చిన మహిళలకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు ఎండలో నిలబెట్టి కనీస సౌకర్యాలు వాళ్లకు కల్పించకుండా త్రాగునీరు టెంటు ఏర్పాటు కూడా చేయకుండా షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసుకొని నామమాత్రంగా కొంతమందికి మాత్రమే ఐదు పది నిమిషాలు 9 రూపాయల చీరలు అందించి ఉత్సవానికి వచ్చిన వారందరినీ చీరలు లేవు వెళ్లిపోండి అని అవమానపరిచి అసౌకర్యపరిచి చేతులెత్తేసిన షాపింగ్ మాల్ యాజమాన్యం తో అనేకమంది మహిళలు మానసికంగా ఇబ్బంది పడడమే కాకుండా పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ అంతరాయం జరిగింది ఇవేమీ పట్టకుండా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆఫర్ పేరుతో ఒకరోజు మొత్తం చీరలు ఇస్తామని చెప్పి మాట మార్చిన జేఎల్ఎం షాపింగ్ మాల్ యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో యాజమాన్యం పైన చర్య కొరకు ఫిర్యాదు చేయడం జరిగింది.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి