ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి
ఏప్రిల్ 8న చలో హైదరాబాద్ ప్రజాధర్నాను జయప్రదం చేయండి
రొంపేడులో పోస్టర్ ఆవిష్కరణ
జై భీమ్ న్యూస్ టుడే (ఇల్లందు):
చత్తీస్గడ్ లో ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని ఏప్రిల్ 8న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ప్రజాధర్నాను విజయవంతం చేయాలని ముద్రించిన వాల్ పోస్టర్లను సోమవారం ఇల్లందు మండల పరిధిలోని పాత రొంపేడులో ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరి మధు,జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరావు,ఆల్ ఇండియా ట్రైబల్ ఫొరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం పాల్గొని మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసి జాతి హననానికి బిజెపికి చెందిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎడతెగని విధంగా హత్యాకాండ కు తెగబడుతున్నాయని అన్నారు.చత్తీస్గడ్ రాష్ట్రంలో వందలాది మందిని ఎన్కౌంటర్ల పేరిట హత్య గావిస్తున్నారని విమర్శించారు.ఈ హత్యకాండను ప్రత్యేకించి ఆదివాసి జాతిని స్వదేశీ,విదేశీ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం హతమారుస్తున్న విధానాన్ని దేశంలోని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు,మేధావులు, ఆలోచనపరులు తీవ్రంగా వ్యతిరేకించి ఖండించాలని అన్నారు.ఏప్రిల్ 8న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ప్రజాధర్నాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి,రాష్ట్ర నాయకులు ఎండి. రాసుద్దీన్,డి.ప్రసాద్, తోడేటి నాగేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు యాసారపు వెంకన్న,రావూరి ఉపేందర్ రావు,ఏఐటిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ సూర్ణపాక నాగేశ్వరరావు,మాజీ సర్పంచ్లు అజ్మీర శంకర్,వి.సరోజన, న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు,డివిజన్ నాయకులు భూక్య హర్జ,కోరం సీతారాములు,నరేష్, బత్తిని సత్యం,ఈసం కృష్ణ,చింత ఉదయ్, పూనెం రంగన్న,కల్తి వెంకటేశ్వర్లు,ఎట్టి నరసింహారావు,అటికం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాభివందనాలతో.
పొడుగు నరసింహారావు
సిపిఐ(ఎమ్-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు మండల కార్యదర్శి.
More Stories
మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న అందాల పోటీలను బహిష్కరించండి! మహిళలను మార్కెట్ వస్తువుగా దిగజారుస్తున్న అందాల పోటీలను రద్దు చేయాలి!
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తో సమావేశం అయిన శాంతి చర్చల కమిటీ నేతలు.
కాశ్మీర్ లోయలో పర్యాటకులపై టెర్రరిస్టుల కాల్పులను ఖండిస్తూ హైదరాబాద్ విద్యానగర్ చౌరస్తాలో PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టెర్రరిస్టుల దిష్టిబొమ్మ దహనం…