72వ ప్రపంచ సుందరి పోటీలను వ్యతిరేకిద్దాం! అందాల పోటీలు మహిళా సాధికారతకు సంకేతమా!! రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తల ఉద్ఘాటన

Spread the love

72వ ప్రపంచ సుందరి పోటీలను వ్యతిరేకిద్దాం! అందాల పోటీలు మహిళా సాధికారతకు సంకేతమా!!

రౌండ్ టేబుల్ సమావేశం లో వక్తల ఉద్ఘాటన

జై భీమ్ న్యూస్ టుడే (హైదరాబాద్):

ప్రగతిశీల మహిళా సంఘం (POW) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో 72వ ప్రపంచ సుందరి అందాల పోటీలను వ్యతిరేకిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్ లో, మార్చి 23 ఉదయం

రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర అధ్యక్షురాలు జి అనసూయ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా POW జాతీయ నాయకురాలు వి. సంధ్య మాట్లాడుతూ ‘మిస్ వరల్డ్ ‘ ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో మే నెలలో జరపనున్నట్లు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు ప్రకటించారు .మే 7 న ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మే 31న గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ వేడుకలు జరగడం సంతోషదాయకమని తెలంగాణ కళా సంస్కృతులు ప్రపంచానికి తెలియడానికి ఇది ఒక అవకాశమని మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక వారసత్వ, యువ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ తో కలిసి ప్రకటించడాన్ని మహిళలందరూ వ్యతిరేకించాలని, పోటీలు జరగకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

గతంలో 1996 లో బెంగళూరులో ,2024 లో ముంబై లో ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించారు. భారత్లో ఈ పోటీలు జరగడం ఇది మూడోసారి. హైదరాబాదుకు ఉన్న చారిత్రక నేపథ్యం వల్లనే ఈ పొటీలకు వెదికగా ఎంపిక చేసినట్లు చెప్తున్నారు . ఇది తెలంగాణ పర్యాటక రంగానికి గొప్ప అవకాశమని తెలంగాణ ఆహారం ,ఆతిథ్యం ,పర్యాటకం, చేనేత వస్త్రాలు పెట్టుబడులు ఇలా అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధికి ఈ వేడుక ఒక అవకాశం అని స్మిత సబర్వాల్ చెప్పడం మహిళకు అవమానకరమని జాతీయ నాయకులు జి. ఝాన్సీ అన్నారు. తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి అనేక మార్గాలు ఉండగా మహిళలకు అవమానకరమైన అందాల పోటీలను ఎంచుకోడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ అన్నారు. స్త్రీల శరీరాలను ప్రదర్శన వస్తువుగా మార్చి సామ్రాజ్యవాద మార్కెట్ కు ప్రయోజనాలు చేకూర్చే ఈ పోటీలకు హైదరాబాదు వేదిక కావడం అందరూ వ్యతిరేకించవల్సిన విషయం అని రాష్ట్ర అధ్యక్షులు జి. అనసూయ అన్నారు.

అనంతరం ఈ సమావేశంలో ఐద్వా అధ్యక్షులు అరుణ జ్యోతి, nfiw రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి, రచయిత్రులు కమల, బండారు విజయ, చైతన్య మహిళా సంఘం నాయకులు జయ, శ్రీదేవి తదితర మహిళా సంఘాల నేతలు పాల్గొని పోటీలను నిలిపివేసేంత వరకు ఉద్యమిద్దాం అని పిలుపునిచ్చారు.

ఇంకా, ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు

శాంత, యశోద, , శివాని, వర్షా భార్గవి, అంబిక, ఇఫ్టు అనురాధ, జర్నలిస్టు సజయ, వసుంధర తదితరులు మాట్లాడుతూ పోటీలను అడ్డుకుందామని, అందుకోసం ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలనీ తెలియజేశారు. చివరగా, విద్యార్థి, యువజన, సాంస్కృతిక సంఘాలతో, కలిసివచ్చే అన్ని ప్రజాసంఘాలతో “మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక” ను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని సమావేశంలో తీర్మానించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా మహిళల ఆత్మగౌరావాన్ని దెబ్బతీసేరకంగా తెలంగాణ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా అడ్డుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘాల నాయకులు ధృడంగా ప్రకటించారు.