ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులపై చేస్తున్న దాడులను ఖండిస్తూ ఈనెల 8న హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాని జయప్రదం చేయండి
కొత్తగూడెంలో పౌర సంఘాల ఆధ్వర్యంలో న్యూడెమోక్రసీ పోస్టర్ ఆవిష్కరణ
జై భీమ్ న్యూస్ టుడే: (కొత్తగూడెం):
ఆపరేషన్ కగార్ పేరిట మధ్యభారతంలో ఆదివాసి ప్రజలపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడులను బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం పౌర సంఘాలు బుద్ధి జీవులు రాజకీయ పార్టీలు ప్రజలు ప్రజా సంఘాలు మేధావులు ఈరోజు చంచుపల్లి సిపిఐ కార్యలయం లో పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.అనంతరం *పౌర హక్కుల సంఘం(CLC) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్,నారాయణ రావు,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరి మధు* లు మాట్లాడుతూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ప్రజా ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం లక్షలాది సైన్యంతో ఆదివాసులపై దాడులు చేస్తూ గ్రామాలను విచ్చిన్నం చేస్తుందని ప్రధానంగా ఆదివాసీలను కాపాడడం కోసం ఇలాంటి కార్యక్రమాలు జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
అడవిని అడవిలోని సహజ సంపదను రక్షించుకునేందుకు సాగిస్తున్న ఆదివాసీల వీరోచిత పోరాటంపై ప్రభుత్వాలు క్రూర మరణకాండను కొనసాగిస్తున్నాయని వారన్నారు అడవిని అడవిలోని సహజ సంపదలను రక్షించుకునేందుకు వారు కృషి చేస్తుంటే కార్పొరేట్ సంస్థల కోసం కార్పొరేట్ మనుషులకు అప్పజెప్పడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన అటవీ సంరక్షణ నియమాల పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చి ఆదివాసీలను హతమార్చి ఆదివాసి సంపదను ఆదివాసి హక్కులను కాల రాయడం కోసం కుట్రలు చేస్తుందని అందులో భాగంగానే అడవిలో ఆదివాసీలను నక్సలైట్లని బూటకపు ఎన్కౌంటర్లు చేస్తుంది. మరోపక్క ఆదివాసి ప్రజల గురించి మాట్లాడిన వారిపై అర్బన్ నక్సలైట్ల పేరుతో ఊపా కేసులు, పిడి కేసులు, రాజద్రోహం కేసులు ప్రయోగం చేస్తా ఉంది. ప్రజాస్వామ్య హక్కులను కాల రాస్తా ఉంది బిజెపి ప్రభుత్వం తోడుకి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో చేతులు కలిపి ప్రశ్నించే గొంతుకులని అణిచివేస్తా ఉంది.ఈ బూటకపు హత్యలను ఖండిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఈనెల 8న ఇందిరాపార్కు వద్ద మహా ప్రజా ధర్నాల నిర్వహిస్తాఉంది దీనికి ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరావు, టీపీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ వెంచర్ సంజీవరావు పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ రావు ఎస్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చార్వాక బి శ్రీనివాస్, ప్రభాకర్ మోత్కూరి మల్లికార్జునరావు రామటంకి అశోక్ గీత తదితరులు పాల్గొన్నారు.
More Stories
మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న అందాల పోటీలను బహిష్కరించండి! మహిళలను మార్కెట్ వస్తువుగా దిగజారుస్తున్న అందాల పోటీలను రద్దు చేయాలి!
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తో సమావేశం అయిన శాంతి చర్చల కమిటీ నేతలు.
కాశ్మీర్ లోయలో పర్యాటకులపై టెర్రరిస్టుల కాల్పులను ఖండిస్తూ హైదరాబాద్ విద్యానగర్ చౌరస్తాలో PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో టెర్రరిస్టుల దిష్టిబొమ్మ దహనం…