ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి ఝాన్సీ

Spread the love

 

  • ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
  • సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి ఝాన్సీ

జై భీమ్ న్యూస్ టుడే: (వికారాబాద్):

ఫిబ్రవరి 20వ తారీఖున హైదరాబాదులో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా జి ఝాన్సీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు హామీల పరిష్కారం కై 20వ తారీకున తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది ఇందిరమ్మ ఇండ్లు,లక్ష ఉద్యోగాలు,2 లక్షల రుణమాఫీ,రైతు భరోసా పెంపు,ఆసరా పెన్షన్ల పెంపు, పోడు భూములకు పట్టాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, యువ వికాసం, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తదితర అనేక హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చడంలో విఫలం అయిందన్నారు కావున ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వై గీత, బి రాములు, పి శ్రీనివాస్, బి మల్లేష్, బి శ్రీకాంత్ పాల్గొన్నారు.