అనుమతి లేని TH జూనియర్ కాలేజ్ (గర్ల్స్) నడిపి, విద్యార్థులను మోసం చేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన PDSU నాయకులు
ఇట్టి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవరించిన విద్యాధికారులను సస్పెండ్ చేయాలి
—– PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్
——————————————————————-
తాండూర్: (జై భీమ్ న్యూస్ టుడే) : స్థానిక తాండూర్ పట్టణంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతలు లేకుండా TH జూనియర్ కాలేజ్ (గర్ల్స్) పేరుమీద గత సంవత్సరం నుండి 2024-25 అకాడమిక్ ఇయర్ కు జూన్ నుండి అడ్మిషన్లు ప్రారంభించి MPC,MEC,BIPC కోర్సులలో అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులను మోసం చేసిన విషయంపై *PDSU (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) తాండూర్ డివిజన్ కమిటీ* ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా *PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ* TH జూనియర్ కాలేజ్ ( గర్ల్స్) కళాశాలకు ఎటువంటి అనుమతులు లేనప్పటికీ కూడా గత సంవత్సరం నుండి 2024-25 అకాడమిక్ ఇయర్ కు అడ్మిషన్లు ప్రారంభించి జూన్ నుండి జనవరి వరకు కళాశాల నడిపి తీరా బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చే సమయం ముందు అనుమతులు లేవని చేతులెత్తేసి విద్యార్థులను మోసం చేసిన ఆల్మస్ విద్యా సంస్థ యజమాన్యంపై, ప్రిన్సిపల్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది. దానితోపాటు గతంలోని PDSU విద్యార్థి సంఘముగా స్థానిక న్యూడల్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ అనుమతులు ఉన్నట్లుగా గతంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే అనుమతి రాలేదని విద్యార్థులను స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాల లో చేర్చడం జరిగిందని తెలియజేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం విద్యా అధికారుల నిర్లక్ష్యమని , ఉన్నత అధికారులు స్పందించి విద్యాధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. అనుమతులేని విద్యాసంస్థలు తాండూర్లో నడుస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అదేవిధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఆల్మాస్ విద్యాసంస్థ యజమాన్యంపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేదంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా సభ్యుడు ప్రకాష్, డివిజన్ అధ్యక్షుడు నవీన్ పాల్గొనడం జరిగింది.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి