అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమీషా క్షమాపణలు చెప్పాలి.నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి.PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్

Spread the love

 

అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమీషా క్షమాపణలు చెప్పాలి.నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్

తాండూర్: జై భీమ్ న్యూస్ టుడే: రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాని నిరసిస్తూ PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ భారత దేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన ఆధారపడే అమిత్ షా పదవుల ఫలాలు అనుభవిస్తున్నాడని ఆ విషయం దేశవ్యాప్త ప్రజలకు అందరికీ తెలుసని తెలియజేయడం జరిగింది.  అయినా అవన్నీ మర్చిపోయిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబేద్కర్ ఏవైనా దేవుడా అని వ్యాఖ్యానించడం సరైనది కాదని వారు అన్నారు. అంబేద్కర్ బడుగు ,బలహీన వర్గాలకు, చీకటి బతుకులకు ఆయన నిజంగానే దేవుడని కొనియాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటైనప్పుడు నరేంద్ర మోడీ ఈ పదవికి కారణం అంబేద్కర్ అని ఆయన రాసిన రాజ్యాంగమేనా అని ఆరోజు గొప్ప చెప్పినవారు, ఈనాడు అంబేద్కర్ దేవుడా?  అని కించపరచడంలో అంతర్వేమిటో అర్థం చేసుకోవాలి అని వారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ మను ధర్మ శాస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని వారు అన్నారు. పైగా క్షమాపణలు చెప్పకపోగా నరేంద్ర మోడీ అమిత్యాలు కలిసి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని ,కాంగ్రెస్ పార్టీ ఏ అంబేద్కర్ ని అవమానించిందని సమర్థించుకుంటున్నారు.  ఏది ఏమైనా రాజ్యసభలో ప్రత్యక్షంగా కామెంట్ చేసి కించపరిచిన అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలని వారన్నారు. రాజ్యాంగం అంటే గౌరవం లేని ఏ వ్యక్తి అయినా సరే రాజకీయ పరిధిలో కొనసాగడానికి వీలులేదని , భారత రాజ్యాంగం వాళ్ళని భారత దేశ పౌరులకు చదువుకునే హక్కు, మానవ హక్కులు, సామాజిక న్యాయము , ఆత్మగౌరవము ఎంతో కొంత వచ్చాయని, ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం వల్ల ఏ మనిషిని కూడా మనిషిగా చూడలేదని అలాంటి మనుధర్మ శాస్త్రం ఆలోచనలు గల వ్యక్తులు ఈరోజు చట్టసభల్లో ఉంటూ రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్లు నటిస్తూ , రాజ్యాంగబద్ధంగానే మేము పనిచేస్తున్నామన్నట్లు గొప్పలు చెప్పుకుంటూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని పేర్కొనడం జరిగింది.