తాండూర్ లో వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలి* *నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

Spread the love

*తాండూర్ లో వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలి*
*నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి*
*వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యాధికారులు*
—– *PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్*
———————————————
తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయి పూర్ లో గల ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ఫుడ్ పాయిజన్ అయి ఇంచుమించు 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది. ఇట్టి విషయంపై సమగ్ర విచారణ జరపాలని PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ డిమాండ్ చేయడం జరిగింది. ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన హాస్టల్ వార్డెన్ పైన మరియు ఇతర సిబ్బంది పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. దానితోపాటు విద్యార్థినులకు మెరుగైన చికిత్స అందించాలని తెలియజేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్లో పరిస్థితి ఘోరంగా తయారైందని , పై అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించకపోవడం, హాస్టల్లో విజిట్ చేయలేకపోవడంవల్ల ఇలాంటి సంఘటనలు ఎన్నో పునరావృతం అవుతున్నాయని తెలియజేయడం జరిగింది. ఇంకా బయటపడని సంఘటనలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటికీ విద్యాధికారుల బాధ్యత వహించాలని పేర్కొనడం జరిగింది. త్వరలోనే PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది.