న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన నవపేట్ ఎస్ ఐ పైన చర్యలు తీసుకోవాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ ,అఖిల భారత రైతు కూలీ సంఘం ( AIKMS ) జిల్లా అధ్యక్షులు వై మహేందర్ ఆధ్వర్యంలో డి.ఎస్.పి కి ఫిర్యాదు చేసిన బాధిత మహిళ
జై భీమ్ న్యూస్ టుడే: (వికారాబాద్ జిల్లా): నవపేట్ మండల్ మాదారం గ్రామానికి చెందిన ఒక మహిళ కొనుక్కున్న భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమకు అమ్మలంటూ ఒత్తిడి చేస్తూ ,అమ్మకుంటే మీ అంతు చూస్తామని బెదిరిస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆమె కొనుక్కున్న భూమిలో బోర్ ఉండడం చేత దానికి కూడా అదనంగా డబ్బులు కట్టించి ఒప్పంద కాగితాలు రాసుకోవడం జరిగింది. అయినా కానీ భూమి మీకు అమ్మ లేదు అంటూ కొంతమంది వ్యక్తులు ఆమెను బెదిరించి భూమిలో బోరు ఎత్తుకుపోయారు. ఆ మహిళ యొక్క తల్లిని పొలంలో పనులు చేస్తుండగా కొట్టిన సందర్భంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా కంప్లైంట్ పైన చర్య తీసుకోకుండా ఆ మహిళతో నీకు కబ్జా ఎవడు ఇచ్చిండు వాని తీసుకురా లేకుంటే నీ అంత చూస్తాను అని బెదిరించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం జరిగింది. ఇట్టి విషయం పై ఎస్సై తన బాధ వినట్లేదని సీఐ నీ కలిసి చెప్పడం జరిగింది సిఐ వద్ద పిలిచి మాట్లాడుతున్న సందర్భంలో మహిళను సతాయిస్తున్న వ్యక్తులు మళ్లీ పొలంలో టాక్టర్ వేసి ప్రయత్నం చేయగా ఇట్టి విషయంపై తిరిగి మళ్లీ ఎస్ఐకి కాంప్లిట్ ఇవ్వగా మీరే తెలివి ఉన్నోళ్లు అనుకుంటున్నారా పై అధికారుల దగ్గరికి పోయేటంత బలుపు ఉందా ? మీకు ఏమనుకుంటున్నారు అని తిట్టడం జరిగింది. ఇట్టి విషయంలో నేడు ఐదవ తారీకు రావాలని చెప్పగా తనకు న్యాయం చేస్తారు ఎస్ఐ గారు అనే ఉద్దేశం తో వెళ్లిన మహిళకు చేసేది ఏం లేదు , నీ దిక్కున చోట చెప్పుకపో ఎక్కువ కథలు పడితే కేసు పెట్టి లోపల వేస్తా ఏమనుకుంటున్నావో అని బెదిరిస్తూ రియల్ వ్యాపారులకు పొలిటికల్ పలుకుబడి ఉన్న వ్యక్తులకు మద్దతునిస్తూ మహిళను కించపరిచేలా మాట్లాడుతూ అసభ్యకరంగా దుర్భాషలాడుతూ మాట్లాడిన ఎస్సై పైన చర్య తీసుకోవాలని డి.ఎస్.పి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
More Stories
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి
తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునేలా ప్రభుత్వంతో చర్చలు జరపండి