న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన నవపేట్ ఎస్ఐ నీ సస్పెండ్ చేయాలి.
ప్రగతిశీల మహిళా సంఘం (POW)రాష్ట్ర కార్యదర్శి వై గీత, CPM జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, PDSU జిల్లా కార్యదర్శి పి శ్రీనివాస్,AIKMS జిల్లా కార్యదర్శి బి మల్లేష్.
సంఘాల ఆధ్వర్యంలో ఎస్.పి కి ఫిర్యాదు చేసిన ప్రజాసంఘాల నాయకులు, బాధిత మహిళ. జిల్లా ఎస్పీ గారు స్పందించి చర్యలు తీసుకోకుంటే మహిళా కమిషన్ ఆశ్రయిస్తామని తెలియజేయడం జరిగింది.
జై భీమ్ న్యూస్ టుడే :(వికారాబాద్ జిల్లా): నవపేట్ మండల్ మాదారం గ్రామానికి చెందిన ఒక మహిళ భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమకు అమ్మలంటూ ఒత్తిడి చేస్త బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆమె కొనుక్కున్న భూమిలో బోర్ ఉండడం చేత దానికి కూడా అదనంగా డబ్బులు కట్టించి ఒప్పంద కాగితాలు రాసుకోవడం జరిగింది. అయినా కానీ భూమి మీకు అమ్మ లేదు అంటూ ఆమెను ఆ మహిళ యొక్క తల్లిని పొలంలో పనులు చేస్తుండగా కొట్టిన సందర్భంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా కంప్లైంట్ పైన చర్య తీసుకోకుండా ఆ మహిళతో నీకు కబ్జా ఎవడు ఇచ్చిండు వాని తీసుకురా లేకుంటే నీ అంత చూస్తాను అని బెదిరించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం జరిగింది. ఇట్టి విషయం పై ఎస్సై తన బాధ వినట్లేదని సీఐ నీ కలిసి చెప్పడం జరిగింది. సిఐ వద్ద పిలిచి మాట్లాడుతున్న మహిళను పై అధికారుల దగ్గరికి పోయేటంత బలుపు ఉందా మీకు ఏమనుకుంటున్నారు అని తిట్టడం జరిగింది. న్యాయం కోసం వెళ్లిన మహిళకు చేసేది ఏం లేదు నీ దిక్కున చోట చెప్పుకపో ఎక్కువ కథలు పడితే కేసు పెట్టి లోపల వేస్తా ఏమనుకుంటున్నావో అని బెదిరిస్తూ రియల్ వ్యాపారులకు పొలిటికల్ పలుకుబడి ఉన్న వ్యక్తులకు మద్దతునిస్తూ మహిళను కించపరిచేలా మాట్లాడుతూ అసభ్యకరంగా దుర్భాషలాడుతూ మాట్లాడిన ఎస్సై పైన చర్య తీసుకోవాలని ఎస్.పి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. AIKMS నాయకులు రాములు ,PDSU నాయకులు శ్రీకాంత్, అశోక్, తదితరులు పాల్గొన్నారు
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి