ఏపీ నిరుద్యోగులకు తియ్యటి వార్త.. ఈ ఛాన్స్ కొట్టితీర్సాల్సిందే!

Spread the love

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఎలాగూ ఇవ్వట్లేదు. కనీసం ఉద్యోగాలు ఇస్తే అలాగైనా నిరుద్యోగులు సంతృప్తి చెందుతారు. ప్రభుత్వం ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని అంది కాబట్టి.. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి. ఇప్పుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అలాంటి సంతృప్తికర వార్త ఒకటి చెప్పారు.

మంత్రి ప్రకారం.. ఏపీ దేవాదాయశాఖలోని.. అనేక క్యాడర్లలో.. దాదాపు 500 పోస్టులను త్వరలో భర్తీ చెయ్యబోతున్నారు. ఇందుకు కొనసాగింపుగా ఆయన ఏమన్నారంటే.. దేవాలయ ట్రస్ట్ బోర్డుల నియామక ప్రక్రియ త్వరలో ఉంటుంది అన్నారు. మంచి నిర్ణయమే ఇది. ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేస్తే.. అందులో చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు ఏపీ నిరుద్యోగులకు ఇది అవసరమే.