NEET UG 2024: నీట్ పేపర్ లీక్ జరగలేదా..! అసలు సుప్రీం ఏం చెప్పింది..?

Spread the love

నీట్-యూజీ 2024 కోసం నిర్వహించిన పరీక్షలో కొందరు కాపీ కొట్టారని వేసిన కేసును గతంలో సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే ఆ కేసులో నిజంగానే లోపలు ఉన్నాయని…మరోసారి పున:సమీక్షించాలని ధర్మసనంలో రివ్యూ ఫిటిషన్ నమోదు అయ్యింది. కానీ, అన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయ స్థానం రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

నీట్ పేపర్ లీక్..
దేశంలోని వైద్య విద్యార్థులందరి కోసం ప్రత్యేకంగా నిర్వహించే పోటీ పరీక్ష NEET. ఈ పరీక్ష ద్వారానే MBBS,BDS,ఆయుష్, ఇతర వైద్య సంబంధిత కోర్సుల్లో విద్యార్థులు ప్రవేశం పొందుతారు. ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన NEET-UG 2024కి 23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్షలో కొందరు మాల్ ప్రాక్టీస్, ఇతర సాంకేతికతను ఉపయోగించి కాపీ కొట్టారని కోర్టులో కేసు నమోదు అయ్యింది. దేశ వ్యాప్తంగా జరిగిన పరీక్ష కావడంతో గత మే, జూన్ నెలల్లో పెనుదుమారం రేగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేశారు.