అనుమతి లేని స్కూల్ ల పైన చర్యలు తీసుకోండి
అత్యధిక ఫీజుల దోపిడికి పాల్పడుతున్న శ్రీ చైతన్య పైన చర్యలు తీసుకోవాలి
PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్
జై భీమ్ న్యూస్ టుడే, (తాండూర్) : అనుమతులేని పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకొని, వాటి నడుపుతున్న యజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని PDSU(ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) ఆధ్వర్యంలో స్థానిక MEO గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక తాండూర్ పట్టణంలో గల శ్రీ చైతన్య బ్రాంచ్ టు పేరు మీద సాయిపూర్ లో నడపబడుతున్న స్కూలుకు ఎటువంటి అనుమతులు లేవు, కానీ యదేచ్ఛగా అడ్మిషన్లు ప్రారంభించి గత సంవత్సరం నుండి నడిపిస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు. దానితోపాటు ఆల్మస్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు మీద స్థానిక అపోల పార్కు ప్రక్కన ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తూ ఉన్నారు. వీటితోపాటు స్కూల్ అనుమతి ఒక పేరు మీద ఉంటే మరొక పేరు మీద నడుపుతున్న స్కూల్ లపై, షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా , ఎటువంటి అనుమతులు లేకుండా నడపబడుతున్న ఇతర స్కూళ్ల పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని , వాటిని రద్దు చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. లేదంటే PDSU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది.
More Stories
దొంగ ర్యాంకులతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల పైన చీటింగ్ కేసు నమోదు చేయాలి
విద్యారంగానికి 20%శాతం నిధులు కేటాయించలేదు అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వర్యం చేయడంకోసమే —-PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్
తాండూర్ లో అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్