విద్యారంగానికి 20%శాతం నిధులు కేటాయించలేదు అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వర్యం చేయడంకోసమే —-PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్

Spread the love

విద్యారంగానికి 20%శాతం నిధులు కేటాయించలేదు అంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వర్యం చేయడంకోసమే

—-PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్

జై భీమ్ న్యూస్ టుడే: (తాండూర్):

ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 20%శాతం నిధులు కేటాయించకపోవడంతో ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విద్యారంగాన్ని నిర్వర్యం చేసింది అని చెప్పి, కాంగ్రెస్ మానిఫెస్టోలో 15%శాతం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి, రేవంత్ రెడ్డి ఇవాళ అధికారంలోకి రాగానే కేసీఆర్ చెప్పిన జూటమాటలా పద్ధతిలోనే రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నాడని కనిపిస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చిన హామీల మీద శిత్తశుద్ధి ఉంటే తక్షణమే విద్యారంగానికి 20% శాతం నిధులు కేటాయించాలని చర్యలు చేపట్టాలని ఇయ్యాల కాంగ్రెస్ రాష్ట్ర బడ్జెట్లో 23.108(7.57%) మాత్రమే విద్యారంగానికి నిధులు కేటాయించడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యారంగం పట్ల ఉన్న శిత్తశుద్ధి అర్థమవుతుంది.

 

23,108కోట్ల బడ్జెట్ కనీసం వాటి అభివృద్ధి కాదు కదా కనీసం హాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి కూడా సరిపోని స్థితిలో ఉంది.ఇయ్యాల ఒక్క యూనివర్సిటీని అభివృద్ధి చేయాలంటే కనీసం 1000 నుంచి 1500 కోట్లు కేటాయిస్తే తప్ప యూనివర్సిటీలు బాగుపడే స్థితి రాష్ట్రంలో లేదన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.కానీ ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా రిపోర్ట్ తీసుకోకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది అని మేము భావిస్తున్నాము. కాంగ్రెస్ అధికారంలొకి వాస్తే ప్రభుత్వం విద్యారంగానికి 15%శాతం కేటాయింస్తాం అని మెనిఫెస్టో అన్న మాట ఏదైతే ఉందో కనీసం దాన్ని నీలా పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇవాళ రాష్ట్రంలో విద్యారంగ మొత్తం కూడా నిర్వీర్యం ప్రభుత్వ పాఠశాల విద్య నుంచి మొదలుకొని విశ్వవిద్యాలయాల వారికు కనీసం సౌకర్యలను లేని స్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది.ప్రభుత్వం విద్యారసంస్థల సమస్యల పై విద్యార్థులు ఎదురుకుంటున్న లోపలపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించ లేదంటే విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నికి ఎలాంటి శిత్తశుద్ధి ఉందో ఆలోచించాలన్నారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి 20% నిధులు కేటాయించి యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలనీ PDSU వికారాబాద్ జిల్లా డిమాండ్ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.