ఈ నెల 10 న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ని జయప్రదం చేయండి! కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య

Spread the love

ఈ నెల 10 న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ని జయప్రదం చేయండి! కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య

న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన నవబ్ పేట్ ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ పై SC ST కేసు పెట్టీ అరెస్టు చేసి సస్పెండ్ చెయ్యాలి

జై భీమ్ న్యూస్ టుడే,(తాండూర్):  నవాబుపేట మండల పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన దళిత మహిళ వరమ్మ భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది రీఎల్ ఎస్టేట్ బ్రోకర్లు తమకు అమ్మలంటూ ఒత్తిడి చేస్తూ బెదిరిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆమె కొనుక్కున్న భూమిలో బోర్ ఉండడం చేత దానికి కూడా అదనంగా డబ్బులు కట్టించి ఒప్పంద కాగితాలు రాసుకోవడం జరిగింది.అయినా కానీ భూమి మాకు అమ్మలి. లేదు అంటూ ఆమెను మహిళ యొక్క తల్లి వృద్ధురాలు పొలంలో పనులు చేస్తుండగా నర్సింలు కొట్టిన సందర్భంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా కంప్లైంట్ పైన చర్య తీసుకోకుండా ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ గారు ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, నీకు కబ్జా ఎవడు ఇచ్చిండు వాన్ని తీసుకురా లేకుంటే నీ అంత చూస్తా,అని బెదిరించి ప్రతి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం జరిగింది. ఇట్టి విషయం పై ఎస్సై తన బాధ వినట్లేదని సీఐ నీ కలిసి చెప్పడం జరిగింది.సిఐ వద్ద పిలిచి మాట్లాడుతున్న మహిళను పై అధికారుల దగ్గరికి పోయేటంత బలుపు ఉందాయే నివ్ ఏమనుకుంటున్నారు అని బూతులు తిట్టడం జరిగింది.న్యాయం కోసం వెళ్లిన దళిత మహిళకు చేసేది ఏం లేదు.నీ దిక్కున చోట చెప్పుకపో ఎక్కువ కథలు పడితే కేసు పెట్టి లోపల వేస్తా ఏమనుకుంటున్నావో అని బెదిరిస్తూ రియల్ వ్యాపారులకు పొలిటికల్ పలుకుబడి ఉన్న వ్యక్తులకు మద్దతునిస్తూ మహిళను కించపరిచేలా ఎస్సీ కులం పేరుతో దుసించి మాట్లాడుతూ అసభ్యకరంగా దుర్భాషలాడుతూ మాట్లాడిన ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ పైన
ఎసి,ఎస్టీ కేసు పెట్టీ చర్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తక్షణమే జిల్లా స్థాయి అధికారులు చట్ట పరం అయినా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారుఅదేవిదంగా దళిత మహిళ పొలం లో ఉన్న సాటర్,పైపులు తీసుకొని వెళ్లి తల్లి కూతురు పై దాడి చేసిన వ్యక్తుల పై చట్ట పరం అయినా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం న్ని డీమాండ్ చేస్తున్నాం లేనిచో రాష్ట్ర మహిళా కమిషన్ కు,రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు,రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు,రాష్ట్ర రాష్ట్ర డీజీపీ లకు పిర్యాదు చేస్తామని మహిళకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటాం అని తెలిపారు.

ఉప్పలి మల్కయ్య
కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వికారాబాద్ జిల్లా