*ఏటూరునాగారం వద్ద జరిగిన ఎన్కౌంటర్ బూటకపు హత్యలే

Spread the love

 

*ఏటూరునాగారం వద్ద జరిగిన ఎన్కౌంటర్ బూటకపు హత్యలే

 *సిపిఐ(మావోయిస్టు) నాయకులు బద్రుతో సహా ఏడుగురిని విషప్రయోగం తోటి పట్టుకున్నారు. వీరిని ఆ తర్వాత చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారు. దీన్ని ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారు. ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, నిపుణులైన ప్రత్యేక వైద్యుల చేత మృతుల కుటుంబాల సమక్షంలో సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించాలి. ఈ ఎన్కౌంటర్ కు బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాను ఏడో గ్యారంటీ ఇస్తున్నానని ప్రకటించాడు. ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి బూటకపు ఎన్కౌంటర్ లను రాష్ట్రంలో కొనసాగిస్తున్నాడు. మోడీ ఆదేశాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు.గత టి ఆర్ ఎస్ మతోన్మాద బిజెపి ప్రభుత్వాల వైఖరికి భిన్నంగా రేవంత్ రెడ్డి పరిపాలన లేదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజా వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుంది.*

 

ఇట్లు

*ఆవునూరి మధు*

*సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ*

*రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు*