అంతర్జాతీయ పత్రిక దినోత్సవం శుభాకాంక్షలు…వై గీత ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కార్యదర్శి
మబ్బు మబ్బుల్లో నే… మసక చీకట్లోనే…
వ్యవస్థ గుమ్మం తడుతూ.. సమస్త సమాచారాన్నిస్తూ…
అలసట ఎరుగక… అనునిత్యం ప్రయాణమౌతూ…
అద్దాల మేడల హంగు ఆర్భాటాలు…
నిలువ నీడలేని జాడలు ఎన్నింటినో…
ధనవంతుల ఫైవ్ స్టార్ వసందులు….
నిరుపేదల మాడే పేగులు….
సైద్యంతిక లక్ష్యాలను మరిచిన రాజకీయాలు…
పూటకో పార్టీ మారే పాలకులు…
సామాజిక ఉద్యమాలు….
సమరశీల పోరాటాలు….
కార్మికుల కష్టాలు రైతుల నష్టాలు…
విద్యార్థుల ప్రతిభలు, వైద్యుల సేవలు..
ప్రభుత్వ అధికారుల, ఉద్యోగుల పనితీరు..
ప్రజలు అందుకుంటున్న ప్రతిఫలాలు..
సమస్తం వ్యవస్థను ఆవపోసనం చేస్తూ..
నిత్య విద్యార్థిగా అధ్యయనం చేస్తూ…
సమాజాన్ని మేలు కోల్పోవడం లో…
తన రక్తాన్నంత పెన్ను సిరలో ఇంకుగా మార్చి
నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తున్న జర్నలిస్టులందరికీ
అంతర్జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు
వై గీత
ప్రగతిశీల మహిళా సంఘం (POW)
రాష్ట్ర కార్యదర్శి
More Stories
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
డెడ్ లైన్ ప్రకటించి మనసులను చంపడం ఏమిటి ?
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి