మార్చి 21 – అంతర్జాతీయ అడవి దినోత్సవం సందర్భంగా దామగుండం అడవి కన్నీటి రోదన

Spread the love

మార్చి 21 – అంతర్జాతీయ అడవి దినోత్సవం సందర్భంగా దామగుండం అడవి కన్నీటి రోదన

జై భీమ్ న్యూస్ టుడే: ( తాండూర్): తెలంగాణలోని వికారాబాద్ జిల్లా, పూడూరు మండలంలోని దామగుండం అడవిలో నేవీ రాడార్ స్టేషన్ కోసం 2010లో ప్రస్తావన వచ్చింది. ఈ 2900 ఎకరాల అడవిలో 2713 ఎకరాలు ఎండోమెంట్ భూమిగా 2009లో రిజర్వ్ ఫారెస్ట్‌గా మార్చారు. ఈ అడవిలో 16 వేల రకాల ఔషధ మొక్కలు, 500 అరుదైన వృక్షాలు, 2000 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్లు ఉన్నాయి. అయినప్పటికీ, అధికారులు ఇక్కడ 0.4% అడవి మాత్రమే ఉందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు.

రాడార్ స్టేషన్ కోసం:

1. కెప్టెన్ జీఎం రావు: 899 చెట్లు నరుకుతామన్నారు.

2. PCCF: 1,93,562 చెట్లు తొలగిస్తామన్నారు.

3. 2017 కోర్టు ఒప్పందం: 11,74,000 చెట్లు నాటి, 10 ఏళ్లు సంరక్షిస్తామని చెప్పారు.

 

కానీ, చెట్లు నాటడం జరగలేదని సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. కోర్టు ఒప్పందాన్ని ధిక్కరించి, 125 ఫీట్ల ఎత్తు, 27 కి.మీ రోడ్డు కోసం అనేక చెట్లు తొలగించారు. రీప్లాంటేషన్ శాస్త్రీయంగా జరగక, చెట్లు ఎండిపోతున్నాయి. అడవిలో 20 లక్షల చెట్లు, చిరుతలు, ఎలుగుబంట్లు, నెమళ్లు వంటి వన్యప్రాణులు ఉన్నాయి. వీటి భవిష్యత్తు అస్పష్టంగా ఉంది.

 

ఈ అడవి ఈసీ, మూసీ, కాగ్న నదులకు ఉద్భవ స్థానం. గంగాకు 150 కి.మీ. దూరంలో పరిశ్రమలు నిషేధం అయినప్పటికీ, ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదు? స్థానికుల జీవనోపాధి, ఔషధ గుణాలు, పర్యావరణం నాశనమవుతున్నాయి. చట్టాలు (వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 మొదలైనవి) విస్మరించబడుతున్నాయి.

 

రాడార్ స్టేషన్ దేశ భద్రతకు అవసరమే, కానీ ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి హాని కలగకుండా వేరే ప్రాంతానికి మార్చాలని కోరుతున్నాము. దామగుండం అడవిని కాపాడండి!

సేవ్ దామగుండం అసోసియేషన్ అధ్యక్షులు

వై. గీత, 8639450138