విద్యారంగ, అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే అక్రమ అరెస్టులా?
PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్
CITU జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్
జై భీమ్ న్యూస్ టుడే: (తాండూర్):
ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, CITU జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ , విద్యార్థి , ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా కేటాయింపులు వచ్చేసరికి విద్యారంగానికి తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని తెలియజేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి (23,108 కోట్లు) 7.57% నిధులు మాత్రమే కేటాయించిందని కనీసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్వయంగా వారు ప్రకటించిన విధంగా 15% నిధులు కేటాయించలేదని పేర్కొనడం జరిగింది. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించి 20 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. దానితోపాటు
తెలంగాణ రాష్ట్రంలో బిల్డింగు కార్మికులు , బీడీ కార్మికులు ట్రాన్స్పోర్ట్, హమాలి ,సెక్యూరిటీ గార్డ్స్, తదితర అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మహాధర్నకు పిలుపునిస్తే ముందస్తు అరెస్టు చేయడం ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని , మరోవైపు ప్రజా పాలన ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెబుతున్న ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటే ఎందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారని? డిమాండ్ చేయడం జరిగింది. లేదంటే విద్యార్థి సంఘం ,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా సభ్యులు ప్రకాష్, డివిజన్ అధ్యక్షులు నవీన్ పాల్గొనడం జరిగింది.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి