యూనిటీ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు
పేద ప్రజల కోసం ప్రారంభించిన ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఉపయోగించుకోవాలి .… సయ్యద్ మన్నన్(యూనిటీ చారిటేబుల్ ట్రస్ట్)
జై భీమ్ న్యూస్ టుడే: (పెద్దెముల్ మండల్, మంబాపూర్):
యూనిటీ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక మంబాపూర్ గ్రామం దగ్గర హైదరాబాద్ రోడ్ ప్రక్కనగల బ్లూ స్కై ఫామ్హౌస్ వద్ద ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన స్థానిక తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేగిండి గ్రామానికి చెందిన సయ్యద్ మన్నన్ గారు పేద ప్రజల కోసం ఇలాంటి మంచి ఆలోచన రావడం హర్షించదగ్గ విషయమని , ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించడం ద్వారా పేద ప్రజల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందని , సమాజం మనకేమి చేసిందనేది కాదు సమాజం కోసం మనం ఏం చేశామనేది ముఖ్యమని తెలియజేయడం జరిగింది. ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభము చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం చుట్టుముట్టున్న గ్రామీణ పేద ప్రజలందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ యొక్క అంబులెన్స్ ఉపయోగించుకోవాలని సయ్యద్ మన్నన్ గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు తన వంతు సహాయం చేయడంలో భాగంగా ఈ ఉచిత సర్వీసును ప్రారంభించామని ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే ఉద్దేశంతో ఈ ఉచిత సర్వీసును ప్రారంభించడం జరిగిందని తెలియజేయడం జరిగింది.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి