మార్క్సిస్టు మహోపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకై పోరాడుదాం

Spread the love

మార్క్సిస్టు మహోపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకై పోరాడుదాం

సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 56వ ఆవిర్భావ దినోత్సవం !


జై భీమ్ న్యూస్ టుడే, (వికారాబాద్ జిల్లా):  మర్క్సిస్టు మహా ఉపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ జయంతి, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో ఘనంగా కామ్రేడ్ లెనిన్ జయంతి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా *సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై. మహేందర్* మాట్లాడుతూ,దేశంలో నరేంద్ర మోడీ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు. శ్రమకు తగిన ఫలితం రావాలని, ప్రజల మౌలిక సమస్యల పరిష్కరించబడాలని, ఒక మనిషి మరొక మనిషి దోపిడీ చేయని వ్యవస్థ కావాలని న్యూ డెమోక్రసీ పోరాడుతుందని ఆయన తెలిపారు. మార్క్సిస్టు మహాపాధ్యాయులు లెనిన్ జన్మదినం పార్టీ పుట్టినరోజుగా నిర్వహించుకుంటున్నామని, ఆయన వివరించారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో శ్రామిక వర్గం అడుగడుగునా దోపిడీకి అవమానలకు గురవుతుందని, ఆయన అన్నారు . నరేంద్ర మోడీ సబ్కా వికాస్ నినాదం ఒక మాటల గారడి అని అన్నారు . భారతదేశం ప్రపంచంలోని 191 దేశాల జాబితాలో ఆకలిలో 107వ, పర్యావరణంలో 108వ, పత్రిక స్వేచ్ఛలో 150వ స్థానంలో ఉన్నదని యుఎన్ డి పి వెల్లడించిందని ఆయన తెలిపారు. సమస్త సంపద సృష్టించే రైతు, కార్మికుల వద్ద కేవలం మూడు శాతం మాత్రమే సంపద ఉందని ఆక్స్ఫాం నివేదిక వెల్లడించిందని ఆయన తెలిపారు. మోడీ సర్కార్ లౌకిక విలువలని విస్మరించి, ప్రజాస్వామ్యాన్ని పాతర వేసి ఫాసిస్టు విధానాలతో పరుగులు తీస్తున్నారని ఆయన అన్నారు. కనుక కార్మికులు, రైతులు ఐక్యంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి, సమసమాజ స్థాపనకై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో POW రాష్ట్ర కార్యదర్శి గీత,CPI (ML) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు పి మల్లేష్, AIKMS జిల్లా నాయకుడు రాములు,PDSU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. శ్రీనివాస్, రాజేష్ , శ్రీకాంత్, అశోక్ , శివన్న, ప్రభావతి, వరమ్మ, మహేందర్, మాణిక్యం ,తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

CPI(ML) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి

వై . మహేందర్