హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జిని, క్యాంపస్ భూములను లాక్కోవడాన్ని ఖండిస్తున్నాం.!! PDSU,CITU జిల్లా కమిటీ నాయకులు

Spread the love

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జిని, క్యాంపస్ భూములను లాక్కోవడాన్ని ఖండిస్తున్నాం.!!

— PDSU,CITU జిల్లా నాయకుల ముందస్తు అరెస్ట్ ను ఖండించండి

—-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఏడవ గ్యారెంటీ ఇదేన

జై భీమ్ న్యూస్ టుడే ,(తాండూర్):

తాండూర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జిని, క్యాంపస్ భూములను లాక్కోవడాన్ని ఖండిస్తూ, విద్యార్థులకు మద్దతుగా నిలిచిన PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, CITU జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్ లను ముందస్తు అరెస్టు చేయడం ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వాగ్దానం చేసి ఏడో గ్యారెంటీగా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. దీనిలో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విలువైన భూములను రేవంత్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుంది. ఇది ముమ్మాటికి అప్ప ప్రజాస్వామికమైన చర్య. విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం విద్యార్థులకు సరైన వసతులు, పరిశోధన కేంద్రాల కోసం వినియోగించుకోవాల్సిన 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ400 భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పేరుతో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతూ యూనివర్సిటీ భూములను బడా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం కోసం పూనుకుంది. దీన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ చర్య వల్ల భవిష్యత్ లో క్యాంపస్ లో చదివే విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందనీ గత కొంతకాలంగా విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీని ప్రభుత్వం నియంత్రత్వ ధోరణితో పోలీసుల సహకారంతో యూనివర్సిటీలోకి అక్రమంగా చొరబడి జెసిబి లను తీసుకొచ్చి క్యాంపస్ కి సంబంధం లేని పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా యూనివర్సిటీ భూముల వేలంకు వ్యతిరేకంగా ఆదివారం విద్యార్థులు,విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వారి క్యాంపస్ భూముల సంరక్షణకై శాంతియుతంగా జెసిబి లను అడ్డుకుంటూ ఆందోళన నిర్వహించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థులపై లాఠీచార్జిని ప్రయోగించారు ,హాస్టల్ గదిల్లోకి అక్రమంగా ప్రవేశించి విద్యార్థినీ,విద్యార్థులతో దుర్భాషలాడుతూ అత్యంత పాషవికంగా నెట్టుకుంటూ భయానక వాతావరణన్ని సృష్టించి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులందరినీ తక్షణమే విడుదల చేయాలని PDSU,CITU జిల్లా కమిటీలు డిమాండ్ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. తక్షణమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పేలా మరియు యూనివర్సిటీలో మొహరించిన పోలీసు బలగాలను వెనక్కి పంపాలని,రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూములను వెంటనే హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి విద్యార్థులకు ఇవ్వాలని, లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కేసు నమోదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాము. ఈ ముందస్తు అరెస్టు లో PDSU జిల్లా సభ్యుడు ప్రకాష్ కూడా ఉన్నారు.