భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి  —CITU,PDSU ప్రజా, విద్యార్థి సంఘాల పిలుపు 

Spread the love

తాండూర్ డివిజన్లో షహిద్ భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి

—CITU,PDSU ప్రజా, విద్యార్థి సంఘాల పిలుపు

జై భీమ్ న్యూస్ టుడే (తాండూర్ డివిజన్):

తాండూర్: స్థానిక తాండూరు అంబేద్కర్ విగ్రహం వద్ద స్వతంత్ర సమరయోధుడు ,విప్లవకారుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా CITU జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మరియు PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ లు మాట్లాడుతూ స్థానిక తాండూర్ పట్టణంలో భగత్ సింగ్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి, ఢిల్లీ నగర పురవీధుల్లో ఎర్రకాగితాలను ఎదజల్లుతూ.. ఇంక్విలాబ్ వర్ధిల్లాలి అనే నినాదాలతో దిక్కులుపిక్కటిల్లేలా గర్జిస్తూ, దేశ స్వాతంత్య్రం పార్లమెంట్ లో పొగబాంబులను విసిరి, 23ఏండ్ల వయస్సులోనే చిరునవ్వుత్ ఉరికొయ్యలపై ఉయ్యాల లూగిన విప్లవ యువ కిశోరాలు షహిద్ భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ లని, వారి స్ఫూర్తి, పోరాట చైతన్యాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, దేశ స్వాతంత్రం కోసం, అణిచివేత, దోపిడి, దౌర్జన్యాలకు, సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిరంతర పోరాట స్ఫూర్తితో సాగిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల స్ఫూర్తితో నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయిలో చేగువేరా, ఫైడల్ కాస్ట్రో లాంటి విప్లవ వీరులు అమెరికన్ సామ్రాజ్యవాదులపై పోరాడి అమరులయ్యారని, అదే కోవలో భారత ఉపఖండంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో ఉరి తీయబడినారని, భగత్ సింగ్ తన సహచరులు కలలుగన్న సార్వభౌమాధికారం, లౌకికవాదం, సోషలిజం కోసం పోరాడుతున్న ఎందరికో గొప్ప స్ఫూర్తినిస్తుందని వారు అన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం కుహానా దేశభక్తిని బట్టబయలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలపై అనుసరించే దుశ్చర్యలకు వ్యతిరేకంగా, భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల పోరాట స్ఫూర్తిని,పోరాట చైతన్యాన్ని నేటి యువత అందిపుచ్చుకోవాలని అన్నారు. యువత ప్రశ్నించకుండా వారి మెదళ్లపై సామ్రాజ్యా వాద విష సంస్కృతి, మద్యం, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తుపదార్థాలను బలవంతంగా రుద్దారని అన్నారు. ఈ ప్రమాదం నుండి యువత బయటకు రావాలని అన్నారు, దేశంలో అన్నివర్గాల ప్రజలకు విద్య,వైద్యం, ఉపాది కల్పించడం కోసం పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జైపాల్,వెంకటేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు