ఎండుతున్న రేగొండి ,కొండాపూర్ వరి పంట రైతులకు నీళ్లు వదలాలని CPI (ML) న్యూ డెమోక్రసీ, తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం 

Spread the love

ఎండుతున్న రేగొండి ,కొండాపూర్ వరి పంట రైతులకు నీళ్లు వదలాలని CPI (ML) న్యూ డెమోక్రసీ, తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం 

జై భీమ్ న్యూస్ టుడే: (వికారాబాద్ జిల్లా):వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల్ కొండాపూర్ మరియు రేగొండి కి చెందిన రైతుల వరి పంటలు నీరు అందక ఎండిపోతున్న విషయంపై స్థానిక జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి CPI (ML) న్యూ డెమోక్రసీ, తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా CPI (ML) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై. మహేందర్ మాట్లాడుతూ కొండాపూర్ చెరువు కింద గల వరి పొలం దాదాపు 200 ఎకరాలలో సాగులో ఉంది. ప్రస్తుతం చెరువులో నీళ్లు లేకపోవడంతో నీరు అందకపోవడంతో సాగులో ఉన్న వరి పొలాలు మొత్తం కూడా ఎండిపోతూ ఉన్నాయి అని పేర్కొనడం జరిగింది. దానితోపాటు దాదాపు రెండు గ్రామాల్లో రైతులు ఈ వరుసగు పైన ఆధారపడి జీవన కొనసాగిస్తూ ఉన్నారని ఇప్పుడు వరి పంటకు నీరు అందకపోవడంతో దాదాపు ఈ రెండు వందల ఎకరాల పంట మొత్తం ఎండిపోతుందని పేర్కొనడం జరిగింది. ఈ రెండు గ్రామాల రైతులందరూ ఈ పొలాలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రైతులందరూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని దయచేసి వెంటనే ఇట్టి సమస్యను పరిష్కరించవలసిందిగా స్థానిక జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి రేపటి లోపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే రెండు గ్రామాల రైతులతో కలిసి CPI (ML) న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ,రైతులకు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో POW రాష్ట్ర కార్యదర్శి వై గీత ,PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూర యాదయ్య , PDSU జిల్లా సభ్యులు జైపాల్, జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.