అగ్నివీర్ అభ్యర్థులకు అలర్ట్.. వాయు రిక్రూట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రాం

Spread the love

దేశంలో చాలా మంది యువత అగ్నివీర్‌లో చేరడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, చేరాలి అనుకునే వాళ్లు ఎలా సన్నద్ధమవ్వాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి అసలు అగ్నివీర్ అంటే ఏమిటి.. విధులు ఎలా నిర్వహించాలి.. వంటి చాలా విషయాలు తెలియవు. ఈ సందేహాలను నివృత్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వ అధికారులు సన్నద్ధమైయ్యారు.

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయ అధికారి ఎం. రాధికా, అగ్నివీర్‌ రిక్రూట్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమం 9-11-2024 శనివారం నాడు ఉదయం 11గంటల నుంచి 2 గంటల వరకు జరగనుందని ఆమె తెలిపారు. అగ్నివీర్ వాయులో చేరాలనుకునే ఆసక్తగల వారు ఈ నంబర్లను 9866465024,7386809422 సంప్రదించండి. అయితే ఇది కేవలం అవగాహన సదస్సు మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలి.