రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి
తెలంగాణ అసెంబ్లీలో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి
వికారాబాద్ జిల్లాలో AIKMS ఆధ్వర్యంలో నిరసన
———————————————————————
జై భీమ్ న్యూస్ టుడే: (వికారాబాద్ జిల్లా): సంయుక్త కిసాన్ మోర్చా (SKM) దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక వికారాబాద్ జిల్లా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద AIKMS వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా AIKMS జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై మహేందర్, B మల్లేష్ లు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెటింగ్ పై ప్రతిపాదిత జాతీయ విధాన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొనడం జరిగింది. మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతులకు కనీస మద్దతు దొర కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. దానితోపాటు ఈ విధానాలను తిరస్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 2021 నాటి కేంద్ర ప్రభుత్వం SKM కి చేసిన వాగ్దానాలను వెంటనే అమలుపరచాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేటు మరియు ప్రైవేటు దానితోపాటు బహుళ జాతి కంపెనీల నియంత్రణలోకి తీసుకురావాలని లక్ష్యం పెట్టుకుని ఉందని దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఇలాంటి విధానాలను ఉపసంహరించుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని తెలియజేయడం జరిగింది. మరోవైపు విద్యుత్తు చట్టంలోని సుంకాల పెంపు ,స్మార్ట్ మీటర్లు మొదలైన నిబంధనలు అమలు చేస్తూ రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే వీటన్నిటిని వెనకకు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. లేదంటే దేశవ్యాప్త AIKMS మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో POW రాష్ట్ర కార్యదర్శి గీత,AIKMS జిల్లా నాయకుడు రాములు, PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్,PDSU జిల్లా నాయకులు శ్రీకాంత్ ,జైపాల్, ప్రసాద్, నాయకులు పరిగి యాదయ్య మాదారం మల్లేష్ ,బుడనోళ్ళ రాములు, పరిగి మాణిక్యం ,బోయిని శ్రీనివాస్, మాదారం వెంకటయ్య, బుడనోళ్ళ శ్రీనివాస్ ,వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి