ఈనెల 10న దళిత మహిళ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. జయప్రదం చేయండి *నవబ్ పేట్ ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ ను సస్పెండ్ చేయాలి.

Spread the love

ఈనెల 10న దళిత మహిళ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జయప్రదం చేయండి  నవబ్ పేట్ ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ ను సస్పెండ్ చేయాలి.ఆయనపై విచారణ చెయ్యాలి. సిపిఎం,cpml న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలు డిమాండ్ నేడు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రెస్ట్ హౌస్ లో సిపిఎం, న్యూ డెమోక్రసీ,KVPS, pdsu,aikms,గిరిజన సంఘం,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై మహేందర్, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, PDSUu జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్* *ఏఐకేఎంఎస్ *జిల్లా కార్యదర్శి మల్లేష్*లు మాట్లాడుతూ గత మూడు నెలలుగా నవబ్ పేట మండలంలోని మాదారం, మీనెపల్లి కలాన్, కడిచర్ల, మాదిరెడ్డిపల్లి, తదితర గ్రామాలలో మహిళలు తమ సమస్యలు పరిష్కరించాలని పోలీస్ స్టేషన్కు పోతే మహిళల పట్ల దురుసుగా మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించిన ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ పై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి అరెస్టు చేయాలి. జిల్లాలో గతంలో అరుణ్ కుమార్ గౌడ్ చేసిన పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక కేసు లో ఆయన పై వెంటనే విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమావేశం సందర్భంగా ప్రభుత్వం చేయడం జరిగింది. రాజ్యాంగంలో మహిళలకు ఉన్న హక్కులను కాలరాస్తూ మహిళల పట్ల దురుసుగా అసభ్యంగా ప్రవర్తించిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డిఎస్పి, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసిన నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఎస్సై వెంటనే సస్పెండ్ చేసి దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి కీచక ఎస్సై ని సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీకి కోరుతున్నాం. ఈనెల 10 నాడు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నము. అనంతరం చలో నవపేట్ కార్యక్రమం నిర్వహిస్తామని సమావేశం నిర్వహించడం జరిగింది జిల్లాలో ఉన్న అన్ని అంబేత్కర్, పులే సామాజిక దళిత ప్రజాసంఘాల నాయకులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో బాధితురాలు వరమ్మ, అనసూయ, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్,సిపిఎం నాయకులు లాలయ్య, రాములు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు