నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

Spread the love

నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

 

విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేత

జై భీమ్ న్యూస్ టుడే,(తాండూర్): స్థానిక తాండూర్ పట్టణంలో భాష్యం కళాశాలలో సంకల్ప్ అకాడమీ ఏసీ క్యాంపస్ పేరుతో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతూ ,అత్యధిక ఫీజుల వసుల్ కు పాల్పడుతూ విద్యార్థులను మోసం చేస్తున్న విషయంపై స్థానిక సబ్ కలెక్టర్ గారికి PDSU,KNPS, స్వేరో విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, KNPS రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ చంద్రప్ప, స్వేరో జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్ లు మాట్లాడుతూ భాష్యం కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా NEET ,EAP-CET,ITI CA,CPT కోచింగ్ పేర్లతో అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారు అని పేర్కొనడం జరిగింది. ఇట్టి భాష్యం జూనియర్ కళాశాలలో అకాడమిక్ ఇయర్ నిబంధనలకు వ్యతిరేకంగా సంకల్ప్ అకాడమీ పేరుతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఒకవేళ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఉన్నత విద్యా మండలి ని ముట్టడిస్తామని తెలియజేయడం జరిగింది.