ప్రపంచ సుందరి అందాల పోటీలను రద్దు చేయాలని అడిగినందుకు మహిళా సంఘాల నాయకుల హౌస్ అరెస్టుల తో నిర్బంధించడం అప్రజాస్వామికం
ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కార్యదర్శి వై గీత
జై భీమ్ న్యూస్ టుడే,(వికారాబాద్):
ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర కార్యదర్శి వై గీత ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల యొక్క అంగంగా ప్రదర్శన ప్రపంచస్థాయి పోటీలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లను ఉపసంహరించుకోవాలని మహిళల ఆత్మగౌరవాణి కించపరిచేరకంగా ప్రపంచ సుందరి అందాల పోటీలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండేటటువంటి ఈ పోటీలను ఇక్కడ నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఆర్థికంగా దివాల తీస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికే ఇబ్బందిగా ఉందని చెప్తూ ప్రపంచ సుందరి అందాల పోటీలకు 300 కోట్లు రూపాయలు ఖర్చు చేయడం సరైనది కాదని కోరుతూ ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో పిఓడబ్ల్యు జాతీయ నాయకురాలు సంధ్యతోపాటు ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మి మరియు ఇతర జిల్లాలలో నాయకులను ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టులు చేయడం తెలంగాణ రాష్ట్రంలో అప్రాజస్వామిక చర్యగా భావిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు.
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
నిబంధనలకు వ్యతిరేకంగా భాష్యం సంకల్ప్ అకాడమీ కోచింగ్ A/C క్యాంపస్ పేరుతో నడుపుతున్న భాష్యం జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
మావోయిస్టు జాతీయ కార్యదర్శి, నంబాల కేశవరావు, బూటకపు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ చేపట్టాలి