దొంగ ర్యాంకులతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల పైన చీటింగ్ కేసు నమోదు చేయాలి 

Spread the love

దొంగ ర్యాంకులతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల పైన చీటింగ్ కేసు నమోదు చేయాలి 

తాండూర్ శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయడమేంటి?

—- PDSU జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్


జై భీమ్ న్యూస్ టుడే, (తాండూర్) : శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేటు కాలేజీలలో వచ్చిన జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో ర్యాంకులను ఒక విద్యార్థి రెండు కాలేజీల్లో చదివి , ర్యాంకు సాధించినట్లు తప్పుడు ప్రకటనలు ఇస్తూ వాటిని తమ బ్రాంచ్ ల పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అవే తప్పుడు ర్యాంకులను ప్రచారం చేయిస్తూ తల్లిదండ్రులను ,విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు అని PDSU విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ తెలియజేయడం జరిగింది. విద్య నేర్పించాల్సిన విద్యాసంస్థలే మోసాలకు తెర లేపుతూ ఉంటే అధికారులు ఎందుకు స్పందించడం లేదని పేర్కొనడం జరిగింది. ఎక్కడో వచ్చిన తప్పుడు ర్యాంకులను చూపిస్తూ స్థానిక పాఠశాలలలో తప్పుడు ప్రచారం చేస్తూ, తల్లిదండ్రులను మోసానికి గురి చేస్తు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఉన్నత అధికారులు స్పందించి పాఠశాలలో తప్పుడు ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య ,నారాయణ పాఠశాలల యజమాన్యం పై చీటింగ్ కేసు నమోదు చేయాలని లేదంటే PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో త్వరలో ఉద్యమ కార్య చరణ ప్రకటిస్తామని, చర్యలు తీసుకునేంతవరకు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక్ పాల్గొనడం జరిగింది