TH జూనియర్ కాలేజ్ యజమాన్యంపై ఇప్పటివరకు చర్యలు ఏవి? PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్

Spread the love

TH జూనియర్ కాలేజ్ యజమాన్యంపై ఇప్పటివరకు చర్యలు ఏవి?

PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్

అనుమతి లేని స్కూల్ని కూడా నడుపుతున్న ఆల్మస్ యజమాన్యం

నిద్ర వ్యవస్థలో విద్యాధికారులు

———————————————

తాండూర్: తాండూరు పట్టణంలో TH జూనియర్ కళాశాల పేరుమీద ఎటువంటి అనుమతి లేకుండా నడుపుతున్న ఆల్మస్ విద్యా సంస్థ యజమాన్యంపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియజేయాలని , వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీసులో *PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్* ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలామ్స్ విద్యాసంస్థ యజమాన్యం అనుమతి లేని TH కళాశాల నడపడమే కాకుండా , అపెక్స్ పార్కు పక్కన అనుమతి లేని స్కూల్ని కూడా యదేచ్చగా నడుపుతున్నప్పటికీ ఇప్పటివరకు విద్యాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు వివరించాలని డిమాండ్ చేయడం జరిగింది. అనుమతి లేని స్కూళ్లపైన అధికారులకు ఎందుకింత అలసత్వం వహిస్తున్నారొ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అకాడమిక్ ఇయర్ 2024-25 పూర్తి కావస్తున్న అనుమతులు లేకుండా జూన్ నుండి నేటి వరకు తమ ఇష్టానుసారంగా తరగతులు నిర్వహిస్తూ తాండూరు పట్టణంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు నడుస్తున్నప్పటికీ విద్యాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.