కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని
ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని
మావోయిస్టు పార్టీ తో చర్చలు జరిపే వాతావరణం కల్పించాలని నిరసన
తాండూరు పట్టణంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలా డిమాండ్
——————————————————————-
తాండూర్ , జై భీమ్ న్యూస్ టుడే : చత్తీస్ ఘడ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్టలలో యుద్ధాన్ని తలపిస్తున్నాయని. దేశ సరిహద్దుల్లో ఉండే సాయుధ బలగాలను ఆదివాసి గూడాల వెంట మోహరించడాన్ని నిరసిస్తున్నామని వెంటనే భద్రతాబలగాలని వెనక్కి పంపించాలని స్థానిక తాండూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆపరేషన్ కగార్ కి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు , విద్యార్థి సంఘాలు కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా KNPS రాష్ట్ర ఉపాధ్యక్షులు A. చంద్రప్ప, CPI జిల్లా సెక్రెటరీ విజయలక్ష్మి పండిత్, తెలంగాణ జన సమితి తాండూర్ ఇన్చార్జి సోమశేఖర్, PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ నాయకులు మాట్లాడుతూ
తెలంగాణా-చత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసి, గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారనీ, ఇప్పటికీ హెలికాప్టర్స్, ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్ ల ద్వారా దాదాపు 20 వేల మంది సాయుధ పోలీస్ బలగాలు అక్కడ తిష్ట వేసి ప్రతిరోజు ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయనీ, 3 రోజులుగా పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల పేరుతో 80 మందికి పైగా మావోయిస్టులు, ఆదివాసీలు హతమైనట్లు ప్రసార,ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయనీ, ఈ అడవులన్నీ బాంబుల మోతలతో తళ్లడిల్లుతున్నాయనీ, కర్రెగుట్ట పై ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపుల నుండి ఇటు తెలంగాణ, అటు చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని అడవి ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసులను వందలాదిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారనీ, అమాయకులైన వీరిని కాల్చి చంపి మావోయిస్టులుగా చిత్రించే ప్రమాదం ఉన్నదనీ, కర్రెగుట్ట ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ పోలీస్ బలగాలని వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసి గిరిజనులని వదిలిపెట్టాలని, ఆపరేషన్ కగార్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అడవిలో ఉన్న దాదాపు 84 రకాల ఖనిజ సంపదలను బడా కార్పొరేటు ఆదాని అంబానీలకు అప్పజెప్పాలని ఉద్దేశముతోటే ఈ ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులైన ఆదివాసులను, వారికి అండగా ఉన్న నక్సలైట్ల పైన కాల్పులు జరుపుతున్నారని తెలియజేయడం జరిగింది. తెలంగాణా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ ప్రాంత మంత్రి సీతక్క కూడా స్పందించి ములుగు, చర్ల ప్రాంతాల్లో ఉన్న బలగాలను వెనక్కి పంపే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నారాయణపూర్ భాస్కర్, స్వేరో జిల్లా నాయకులు శివ, PDSU జిల్లా సభ్యుడు ప్రకాష్, డివిజన్ అధ్యక్షుడు నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు
More Stories
“శ్రీ శ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాని ఎన్నుకోవడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గం భాస్కర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షుడు సంజయ్ గౌడ్
పాత తాండూర్ ఫ్లైఓవర్ ఆలోచన విరమించుకోవాలి